
మోకాళ్లపై కూర్చోబెట్టి..కుల బహిష్కరణ చేసి..
అవమానం భరించలేక అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్పీ వీడియో విడుదల చేసిన ఓ కుటుంబం.
గ్రామ కట్టుబాట్ల పేరుతో సాగిన కుల బహిష్కరణ ఒక నిండు కుటుంబాన్ని బలవన్మరణానికి పురికొల్పింది. సారా మాఫియా కంటే ఘోరంగా కులపెద్దలు విధించిన రూ. లక్ష జరిమానా, మోకాళ్లపై నిలబెట్టి చేసిన అవమానం తట్టుకోలేక ఏలూరు జిల్లా లోపూడిలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. చట్టం ఉండగా.. కుల పంచాయితీలేమిటన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామంలో చోటుచేసుకున్న కుల బహిష్కరణ ఘటన ఇప్పుడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
వార్త వివరాల్లోకి వెళ్తే..
ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన బోట్ల కనకరావు గతంలో సారా విక్రయాలు చేసేవాడు. ఈ క్రమంలో ఎక్సైజ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేయగా, జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు. అయితే, కనకరావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ కులపెద్దలు పది రోజుల క్రితం పంచాయితీ నిర్వహించారు. సారా విక్రయాలు ఆపాలని, లేదంటే రూ. లక్ష జరిమానా కట్టాలని హుకుం జారీ చేశారు.
మోకాళ్లపై..

