ఆంధ్రా ప్యారిస్లో తెలంగాణ ఐఆర్ఎస్ అధికారి నిలువు దోపిడీ!
x

ఆంధ్రా 'ప్యారిస్'లో తెలంగాణ ఐఆర్ఎస్ అధికారి నిలువు దోపిడీ!

రూ.5 లక్షల నగదు, 10 లక్షల విలువైన బంగారం, 3 విలువైన ఐఫోన్లు సహా మాయం


ఈ దొంగలకు తరతమ భేదం లేదనుకుంటా.. ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన హోదా ఏమిటో కూడా చూడకుండా నిలువు దోపిడీ చేసేశారు.. అదీ ఎక్కడనుకున్నారు.. ఆంధ్రాప్యారిస్ అని పిలిచే తెనాలిలో. దోపిడీ చేసింది తెనాలి దొంగలో అంతర్రాష్ట్ర దొంగలో ఇంకా తేలలేదు గాని దోపిడీకి గురైంది మాత్రం ఓ తెలంగాణ ఐఆర్ఎస్ అధికారి. కేసు నమోదైంది. దర్యాప్తు సాగుతోంది.

తెలంగాణకు చెందిన Indian Revenue Service (ఐఆర్ఎస్) అధికారి శ్రీరాం శాంతిరాజు ఓ ఆత్మీయుని ఇంట పెళ్లి కోసం గురువారం రాత్రి తెనాలి వెళ్లారు. చెంచుపేటలోని ఓ ఫంక్షన్ హాలు వద్ద కారు పార్క్ చేసి హాల్లోకి వెళ్లారు. ఆత్మీయులను పలకరించి నూతన వధూవరులకు ఆశ్వీరాదం అందించి బయటకు వచ్చి చూస్తే కారు గ్లాస్ పగిలి ఉంది. కార్లో ఉంచి వెళ్లిన బ్యాగు మాయమైంది. ల్యాప్ ట్యాపు, మూడు ఐఫోన్లు, అందులో ఉన్న పాస్ పోర్టు కనిపించకుండా పోయాయి. ఇవిగాక మరో బ్యాగులో ఉంచిన రూ.5 లక్షల నగదు, మరో పది లక్షల విలువైన బంగారు ఆభరణాలు కూడా మాయం అయ్యాయి. దీంతో ఆయన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. చుట్టుపక్కల పరిశీలించినా ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో తెనాలి మూడో పట్టణ పోలీసులకు ఐఆర్‌ఎస్‌ అధికారి ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండగా పక్కనున్న కొల్లిపర గ్రామంలో జరిగినట్టు సమాచారం వచ్చింది. అక్కడ కూడా తాళాలు పగలగొట్టి మరో పది లక్షల విలువైన ఆభరణాలను, నగదును దోచుకుపోయారు. ఈ రెండింటికి ఏదో లింకు ఉండి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కూడా దర్యాప్తు సాగిస్తున్నారు.
Read More
Next Story