బంగాళాఖాతంలో అల్పపీడనం..రేపు ఏపీలో వర్షాలు
x

బంగాళాఖాతంలో అల్పపీడనం..రేపు ఏపీలో వర్షాలు

ఈ నెల 18న తమిళనాడు రాష్ట్రంలో తీరం దాటనుంది. సముద్ర తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశముంది.


ఆంధ్రప్రదేశ్‌కు వర్షాల ముప్పు ప్రమాదం పొంచి ఉంది. సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతానికి ఇది స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది బలపడనుంది. దీంతో మరింత తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అలా తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత తన దిశను మార్చుకుంటుంది. వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలా దిశ మార్చుకున్న అల్పపీడనం ఈ నెల 18న తమిళనాడు రాష్ట్రంలో తీరం దాటనుంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోను కనిపించనుంది. దీంతో ఈ నెల 17న అంటే మంగళవారం ఆంధ్రప్రదేలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. సముద్ర తీరం వెంబడి 30కిమీ నుంచి 35కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకు వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది.


Read More
Next Story