
ఐఎండీ విడుదల చేసిన చిత్రం
ఆంధ్రప్రదేశ్ కి మరో 36 గంటలు భారీ వర్షాలే వర్షాలు
ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే 36 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈశాన్య రుతుపవనాల ఆరంభంలో ఏర్పడిన తొలి అల్పపీడనం ఇది. తీర ఆంధ్ర, రాయలసీమలో మెరుపులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 21 మంగళవారం తీర ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అక్టోబర్ 22 నుండి 24 వరకు రాష్ట్రంలోని తీర ఆంధ్రప్రదేశ్ (CAP), యానాం, రాయలసీమ ప్రాంతాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.
దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతిలో ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. తిరుమలను వానలు ముంచెత్తుతున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత మత్స్యకారులు, నావికులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.
విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్లను ప్రకటించింది: అవసరమైన వారు ఈనెంబర్లను సంప్రదించవచ్చు. 112, 1070, 1800-425-0101.
వర్షం, గాలివానల సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా ప్రజలు ఈ నంబర్లకు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
Next Story