మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై లుకౌట్‌ నోటీసులు
x

మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై లుకౌట్‌ నోటీసులు

కూటమి ప్రభుత్వం, పోలీసులు పేర్ని నాని కుటుంబాన్ని వెంటాడుతున్నారు. ఈ కేసులు ఏమి జరుగుతోందనే ఆసక్తి నెలకొంది.


మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఆమె ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆమె కోసం గాలింపులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కేసులో పేర్ని నాని కుటుంబం కూడా ఇరుక్కొని పోయింది. రేషన్‌ బియ్యం మాయమైన ఘటనలో పేర్ని నాని కుటుంబం కేసు ఎదుర్కొంటోంది. తన పేరు మీద ఉన్న గోడౌన్‌లో రేషన్‌ బియ్యం మాయం అయ్యాయని పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు సహకరించాలని పోలీసులు ఆమెను కోరారు. ఆ మేరకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే విచారణకు హాజరు కాకపోవడంతో పాటు ఇప్పటి వరకు స్టేషన్‌కు వెళ్లింది లేదు. రేషన్‌ బియ్యం కేసు తెరపైకి వచ్చిన నాటి నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. జయసుధతో పాటు ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజా కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. మరో వైపు జయసుధ వ్యక్తిగత కార్యదర్శి మానస కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు, మచిలీపట్నం అంసెబ్లీ నియోజక వర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి పేర్ని కిట్టూలపైన కూడా ఇది వరకే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలో వారు ఇంట్లో లేక పోవడంతో ఇంటి గోడలకు, డోర్‌ గేట్లకు నోటీసులు అంటిచారు. పోలీసు స్టేషన్‌కు వచ్చి విచారణకు సహకరించాలని అయితే పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టూ కూడా పోలీసుల విచారణకు హాజరు కాకపోవడంతో జయసుధపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ కేసులో ఎమి జరుగుతోందనే దానిపై ఆసక్తి నెలకొంది.
Read More
Next Story