హాఫ్ సూట్లో లోకేష్ న్యూ లుక్..అదిరిపోలా
x

హాఫ్ సూట్లో లోకేష్ న్యూ లుక్..అదిరిపోలా

విదేశాల పర్యటనలకు తరచుగా వెళ్తున్న మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నారు.


సీఎం చంద్రబాబు కుమారుడు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి (విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్)గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు. లేదా ఢిల్లీ వెళ్లినప్పడు చాలా సింపుల్ గా కనిపిస్తారు. ఆయన వస్త్రధారణ శైలి ఎక్కువగా ఫార్మల్ గా సింపుల్‌గా ఉంటుంది. రాజకీయ కార్యక్రమాలు, మీటింగులు, పబ్లిక్ ఈవెంట్‌లలో కూడా ఇలానే కనిపిస్తారు.

సాధారణ డ్రెస్ కోడ్

  • ఫార్మల్ వేర్: వైట్ షర్ట్‌లు (లాంగ్ స్లీవ్స్ లేదా షార్ట్ స్లీవ్స్) పై నేవీ బ్లూ లేదా బ్లాక్ ట్రౌజర్స్ ధరిస్తారు.
  • ఇది నారా లోకేష్ సిగ్నేచర్ స్టైల్. వైట్ కలర్ లోకేష్ ప్రిఫరెన్స్. మరి ముఖ్యంగా రాజకీయ కార్యక్రమాల్లో అలానే కనిపిస్తారు. అరుదుగా బ్రౌన్ టి-షర్ట్ లేదా లైట్ కలర్ పోలో షర్ట్‌లు, ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ విజిట్స్ లేదా క్యాజువల్ మీటింగ్‌లలో అలా కనిపిస్తారు.ఉదాహరణకు, 2025 జనవరిలో పవన్ కల్యాణ్‌ను ఎయిర్‌పోర్ట్‌లో కలవడానికి బ్రౌన్ టి-షర్ట్ ధరించారు.
  • ట్రెడిషనల్ వేర్: టెంపుల్ విజిట్స్ లేదా పండుగల సందర్భాల్లో ధోతీ లేదా కుర్తా (లైట్ కలర్స్‌లో) ధరిస్తారు.
  • ఇలా నారా లోకేష్ డ్రెస్ కోడ్ చాలా ప్రొఫెషనల్, క్లీన్ గా, సింపుల్‌గా ఉంటుంది. ఇది అటు పార్టీ కేడర్లోను, ఇటు అధికార వర్గాల్లోను గౌరవాన్ని తెచ్చి పెట్టేదిగా ఉంటుందని టీడీపీ శ్రేణుల్లో చర్చ ఉంది.

అయితే విదేశాలకు వెళ్లిన సందర్బాల్లో మాత్రం తరచుగా తన డ్రెస్ కోడ్ మర్చుకుంటూ వస్తున్నారు. ఆయా దేశాల పర్యటనలకు తగ్గట్టుగాను, అక్కడ నిర్వహించే సమావేశాలకు అనుగుణంగా తన డ్రెస్ కోడ్ ను మార్చుకుంటుంటారు.

గతంలో పర్యటనలు చేసిన నందర్భాలలో ఆయన ఫుల్ సూట్ ను ధరించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే తాజా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న నారా లోకేష్ హఫ్ సూట్ లో తన కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

ఈ హాఫ్ సూట్ లుక్కే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆయన సన్నిహితులు, అభిమానులు, పార్టీ కేడర్ హాఫ్ సూట్ లో ఉన్న లోకేష్ ను చూసుకుని తెగ మురిసిపోతున్నారు.

నారా లోకేష్ హాఫ్ సూట్ లుక్ అదిరిపోయిందని, చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తున్నారని చర్చించుకుంటున్నారు.

Read More
Next Story