
లోకేష్ ఆసక్తికర సెల్ఫీ, క్యాప్షన్ ఏంటంటే..
శ్రీచరణి, మిథాలీ రాజ్, సీఎం చంద్రబాబులతో కలిసి లోకేష్ సెల్పీ దిగారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ శ్రీచరణి, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సెల్ఫీ దిగారు. ఈ ముగ్గురితో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళల వన్డే వరల్డ్ కప్ విజయం సందర్భంగా శ్రీచరణి రాష్ట్రానికి చేరుకున్న వేళ లోకేష్ ఈ సెల్ఫీ తీసుకున్నారు.
ఫ్రేమ్‌లో - ఇద్దరు మ్యాచ్-విన్నర్లు, ఒక లెజెండ్, అండ్ జీవితకాల ఓ అభిమాని అని క్యాప్షన్ పెట్టి నారా లోకేష్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ సెల్ఫీని పోస్టు చేస్తూ, శ్రీచరణి విజయాన్ని అభినందించారు. మిథాలీ రాజ్ లాంటి దిగ్గజం, రాజకీయ దురంధరుడు, సీఎం చంద్రబాబులు ఉండటం ఈ సెల్ఫీకి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సెల్ఫీ రాష్ట్రంలో మహిళల క్రికెట్ అభిమానులను మరింత ఆకట్టుకుంది.
శ్రీచరణి వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఘన స్వాగతం లభించింది. మిథాలీ రాజ్ ఆమెను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా లోకేష్ ఈ సెల్ఫీని షేర్ చేయడంతో యువతలో క్రికెట్ ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఇలాంటి సంఘటనలు ఊతమిస్తాయని క్రీడా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ పోస్టు చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వేలాది లైక్స్, షేర్లు సొంతం చేసుకుంది.
In the frame - Two match-winners, one legend, and a lifelong fan! #APWelcomesShreeCharani pic.twitter.com/lGcXuCRmM5
— Lokesh Nara (@naralokesh) November 7, 2025

