ఇంట్లో కూర్చుని 'ఆత్మ'లతో మాట్లాడుతున్నావా జగన్? లోకేశ్ సెటైర్లు
నారా లోకేశ్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సెటైర్లు పేల్చారు. ఈసారి సెటైర్లన్నీ దెయ్యాలు, ఆత్మలు, రెడ్ బుక్, బ్లూ బుక్, మంచి పుస్తకం చుట్టూ తిరిగాయి.
తెలుగుదేశం పార్టీ నాయకుడు, చంద్రబాబు కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సెటైర్లు పేల్చారు. ఇంట్లో కూర్చుని ఆత్మలతో మాట్లాడుతున్నావా జగన్ అంటున్నారు. ఇంట్లో కూర్చొని 'గేమ్స్' ఆడేవారికి అభివృద్ధి ఏమి కనిపిస్తుందన్నారు. జగన్ ఇంట్లో పబ్జీగేమ్స్ ఆడేవారన్న అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో రెడ్ బుక్ ను అమలు చేస్తున్నామని లోకేశ్ చెబుతుంటే తమది మంచి బుక్ అని జగన్ అంటున్న నేపథ్యంలో నారా లోకేశ్ రెడ్ బుక్ యాక్షన్ మొదలైందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వాళ్లపై కఠిన చర్యలు తప్పవన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచీ పేర్లన్ని రెడ్ బుక్ లో ఉంటాయంటున్నారు. ఆయన అక్టోబర్ 11న మీడియాతో మాట్లాడారు.
"యాక్షన్ అనివార్యం. వైసీపీ వాళ్లు ఏ పుస్తకం పెట్టుకున్నారో వాళ్లకే తెలియదు. బహుశా నా నుంచి స్ఫూర్తి పొంది ఉంటారు. రాయలసీమ తయారీ రంగానికి కేంద్రం కాబోతోంది. ఉత్తరాంధ్ర సేవా రంగానికి సెంటరు కానుంది. పరిపాలన ఒకే దగ్గర ఉంటుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం " అన్నారు మంత్రి లోకేశ్.
కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. బ్లూ బ్యాచ్ (వైసీపీ) ఆగడాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఇబ్బంది అనిపిస్తే ఎంతమాత్రం ఉపేక్షించం. వరదలొస్తే జగన్‌లా పరదాలు కట్టుకునట్లు.. సీఎం చంద్రబాబు అండ్ టీమ్ ఇంట్లో కూర్చోలేదు. జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోయినట్టు లేదు. గతంలో ఇలానే ఆత్మలతో మాట్లాడి కియా తమ ఘనతే అన్నారు. ఇప్పుడు టీసీఎస్ గురించి ఏ ఆత్మతో మాట్లాడారు అని ప్రశ్నించారు లోకేశ్. జగన్ హయాంలో తరిమేసిన పరిశ్రమలన్నీ మళ్లీ తెస్తున్నామని.. ఇందుకు లూలూ, అశోక్ లైల్యాండ్ లే నిదర్శనం అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రాయలసీమలో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్, విశాఖలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌లకు ఉన్న అవకాశాలపై ముంబై పారిశ్రామిక వేత్తలతో చర్చించినట్టు లోకేశ్ పేర్కొన్నారు.
పాత రేషన్ కార్డులకు గుడ్ బై..
వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోలున్న పాత రేషన్‌కార్డులను తొలగించి కొత్త కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. లేత పసుపు రంగుతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించిన కార్డుల నమూనాను అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. త్వరలో కొత్త రేషన్ కార్డుల నమూనాను ప్రజల ముందు ఉంచుతామని లోకేశ్ చెప్పారు.
Next Story