‘నారా లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ అయింది!’
x

‘నారా లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ అయింది!’

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రలోకి ఎంట్రీ ఇచ్చింది. నారా లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ అయిందంటూ టీడీపీప సీనియర్ నేత కనకమేడల.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.


తెలంగాణను అట్టుడికిస్తున్న అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం పనే అని, గులాబీ బాస్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ వ్యవహారంలో కేవలం తెలంగాణ నేతల ఫోన్లే కాకుండా మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ అయిందట. ఈ అంశాన్ని పేర్కొంటూ టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. అంతేకాకుండా లోకేష్ ఫోన్ ట్యాప్‌ చేయడానికి పెగాసస్‌ను మాల్వేర్‌ను వినియోగించారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఈ పెగాసస్.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకా ఆయన ఏమన్నారంటే..

‘‘పెగాసస్ సాఫ్ట్ వేర్‌తో లోకేష్ ఫ్యాన్‌ను ట్యాప్ చేసినట్లు ఐఫోన్ సందేశాలు వచ్చాయి. ఇలాంటి సందేశాలు గత నెల మార్చిలో కూడా ఆయనకు వచ్చాయి. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని మీ దృష్టికి పలుమార్లు తీసుకొచ్చాం. వారిద్దరు అధికారులు ఎన్‌డీఏ కూటమి సభ్యలపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. రెండుళ్లుగా ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీపీ నియామకం ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం. ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది. సాధారణ ఎన్నికల సమయంలో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారిని బదిలీ చేసి వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా ఉండే నిజాయితీ గల అధికారులను నియమించగలరు’’అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు కనకమేడల.

Read More
Next Story