
అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వదు
అదే విజనరీ నాయకుడు, ప్రిజనరీ నాయకుడుకు మధ్య ఉన్న తేడా అని మంత్రి లోకేష్ అన్నారు.
అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా మెడికల్ కాలేజీలపై వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరి ఉందంటూ నారా లోకేష్ విమర్శించారు. నాడు కాంగ్రెస్ మాటలను పట్టించుకుని ఉన్నా, వారి విమర్శలకు వెనక్కి తగ్గి ఉన్నా 1994లో చంద్రబాబు ఇన్ని ఇంజినీరింగ కళాశాలలు వచ్చి ఉండేవి కాదని, అదే విజనరీ నాయకుడు సీఎం చంద్రబాబుకు, ప్రిజనరీ నాయకుడు వైఎస్ జగన్‌కు మధ్య ఉన్న తేడా అఈని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
సోమవారం అసెంబ్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ మెడికల్ కాలేజీలపై వైసీపీ, ఆ పార్టీ నాయకులు, మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు చేస్తున్న రాద్దాంతంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలను తాము ప్రైవేటు పరం చేయడం లేదని, కేవలం పీపీపీ మోడ్‌లోనే తాము వెళ్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. రోడ్లు కూడా పీపీపీ మోడ్‌లోనే చేస్తున్నామని, మరి వైసీపీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదని లోకేష్ ప్రశ్నించారు. తన సొంత అసెంబ్లీ నియోజక వర్గమైన పులివెందులలో కూడా జగన్ మెడికల్ కాలేజీని కట్టలేదన్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీతో పాటు శాసన మండలిలో కూడా కూటమి ప్రభుత్వం అనుసరించే వైఖరిని స్పష్టం చేస్తామని లోకేష్ పేర్కొన్నారు.