తిరుపతిలో అరాచకం, దళిత యువకుణ్ణి చావబాదిన వైసీపీ నేత!
x

తిరుపతిలో అరాచకం, దళిత యువకుణ్ణి చావబాదిన వైసీపీ నేత!

నారా లోకేశ్ పంపిన వీడియో వైరల్, హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు నిందితుల అరెస్ట్


వైఎస్ఆర్ సీపీ (YSRCP) కీలక నేతలపై టీడీపీ నాయకుడు లోకేశ్ మరో బాంబు పేల్చారు. తిరుపతిలో భూమన అభినయ్‌ అనుచరుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని ట్వీట్ చేశారు. దళిత యువకుణ్ణి ఓ నేత కర్రతో కొడుతున్న వీడియోను పోస్ట్ చేశారు.
దళిత యువకుడు నగదు ఇవ్వకపోవడాన్ని కారణంగా చూపి కిడ్నాప్ చేసి, లాడ్జీలో బంధించి దుడ్డు కర్రలు, పైబర్‌ లాఠీలతో చిత్రహింసలు జరిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాష్ట్ర రాజకీయ రంగంలో కలకలం చెలరేగింది.
బాధిత యువకుడు పవన్ కుమార్‌ను బందీగా ఉంచి, కుటుంబ సభ్యులు అడిగినా సమాచారం ఇవ్వకుండా వైసీపీ నేతలు దాష్టీకం చేస్తున్నారని తిరుపతి టీడీపీ నేతలు ఆరోపించారు. తమ కుమారుణ్ణి బంధించిన విషయం తెలుసుకున్న తండ్రి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో గత రాత్రి పవన్ కుమార్ తండ్రికి ఈ చిత్రహింసలున్న వీడియోలు అందాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే..
తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం ఎదురుగా ఉన్న దుకాణం కాంట్రాక్ట్‌ను తనకు రాసివ్వాలంటూ వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి అనిల్ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. పవన్‌ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేసి ఎంఆర్‌పల్లిలోని తన ఇంట్లో బంధించి తీవ్రంగా హింసించారు. ఆ యువకుడిని చితకబాదుతుండగా అనిల్ రెడ్డి స్నేహితులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
స్పందించిన హోం మంత్రి అనిత..
భూమన కరుణాకర్‌రెడ్డి అనుచరుల ఆగడాలపై హోం మంత్రి అనిత స్పందించారు. రౌడీ రాజకీయం చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనన్నారు. ‘‘తిరుపతిలో దాడికి పాల్పడిన వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న సూత్రధారులను కూడా వదిలేది లేదు. వైసీపీ రాక్షస మనస్తత్వానికి ఈ దాడులే నిదర్శనం. దాడి చేసిన వారి పరామర్శకు పులివెందుల ఎమ్మెల్యే వెళ్తారా?’’ అని హోం మంత్రి అన్నారు.
అదే సమయంలో యూప్ లోకేష్ X (Twitter) వేదికపై స్పందిస్తూ, “తిరుపతిలో దళిత యువకుని జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో దళితులపై దాడులను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. పోలీసు వ్యవస్థ పార్టిలోని నాయకుల ఆదేశాలను పాటిస్తూ న్యాయాన్ని విస్మరించుటంతో ఈ దాడులు జరిగుతున్నాయని” పోస్ట్ చేశారు.
Read More
Next Story