నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికి లోకేష్‌ భరోసా
x

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికి లోకేష్‌ భరోసా

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారు కోసం ఆర్టీజీఎస్‌ అదికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్‌.


నేపాల్‌లో చోటు చేసుకున్న ప్రత్యేక పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ తెలుగు వారితో మంత్రి నారా లోకేష్‌ వీడియో కాల్స్‌ ద్వారా మాట్లాడి భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఖాట్మండులోని పశుపతినాథ్‌ టెంపుల్‌కు సమీపంలో గల రాయల్‌ కుసుమ్‌ హోటల్‌లో తలదాచుకుంటున్న విశాఖకు చెందిన 81 మంది తెలుగు వారితో లోకేష్‌ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, క్షేమంగా ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఖాట్మండు నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరో వైపు మంత్రి నారా లోకేష్‌ తన అనంపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. నేపాల్‌ దేశంలో నెలకొన్న ప్రత్యేక పరస్థితుల నేపథ్యంలో తన పర్యటనను క్యాన్సెల్‌ చేసుకున్నారు. నేపాల్‌ దేశంలో చిక్కుకున్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీజీఎస్‌ ద్వారా సేవలు అందించాలని భావించారు. అందులో భాగంగా ఆర్టీజీఎస్‌ అధికారులతో మంత్రి లోకేష్‌ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటుతో పాటు ఏపీలోని ఆర్టీజీఎస్‌ దార్వా అక్కడి తెలుగు ప్రజలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు.
అందులో భాగంగా ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలు ఏదైన అత్యవసర సహాయం కోసం ఈ హెల్ప్‌లైన్లను సంప్రదించి సాయం పొందొచ్చని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. అత్యవసర సాయం కోసం 91 9818395787, 0863 2340678, వాట్సాప్‌ నంబర్‌ 91 8500027678, ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించొచ్చు. ఖాట్మండులోని భారత రాయభార కార్యాలయంలోని హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. 977–980860 2881, 9810326134 నంబర్లకు ఫొన్‌ చేసి సంప్రదించొచ్చు. దీంతో పాటుగా వాట్సాప్‌లో కూడా సంప్రదించొచ్చు.
Read More
Next Story