శనివారం నుంచే మద్యం షాపులు బంద్‌
x

శనివారం నుంచే మద్యం షాపులు బంద్‌

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా శనివారం నుంచే మద్యం షాపులు క్లోజ్‌ చేయాలని నిర్ణయించారు.


మే 13న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముందు నుంచే మద్యం షాపులు బంద్‌ చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దాదాపు 10 రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు నిర్వహిస్తున్న నేపద్యంలో రెండు రోజులు ముందుగానే మందు షాపులు మూసి వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో మందు బాబులకు షాకిచ్చినటై్టంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్స్‌ షాపులు, బార్లు మూసి వేయాలని ఈసీ ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా మద్యం షాపులు మూసి వేయాలనే నిర్ణయానికి ఈసీ వచ్చింది. రాష్ట్రంలోని వైన్స్‌ షాపులు, బార్లు, కల్లు కాంపౌండ్లు సైతం మూసి వేయాలని ఆదేశించింది. ఈ నేపద్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. దీంతో మే 11వ తేదీ నుంచి అంటే శనివారం సాయంత్రం 6 గంటల నుంచే అన్ని మద్యం షాపులు, బార్లు బంద్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మద్యం షాపులు, బార్లు తిరిగి రెండో రోజుల తర్వాత ప్రారంభం కానున్నాయి. అంటే మూడో రోజు ఓపెన్‌ కానున్నాయి. మూడో రోజు అంటే మే13. మే 13 పోలింగ్‌ రోజు. ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. అయితే అదే రోజు పోలింగ్‌ పూర్తి అయిన తర్వాత అంటే సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి మద్యం షాపులు, బార్లు, కల్లు కాంపౌండ్లు తెరచుకోనున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మరో వైపు ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం షాపులు, బార్లు, కల్లు కాంపౌండ్లు మూత వేయనున్నారు. అంటే జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ రోజు కూడా అన్నీ బంద్‌ కానున్నాయి. ఎన్నికల నేపద్యంలో మద్యం షాపులు, బార్లు, కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్‌ శాఖ అధికారులతో పోలీసులు కూడా నిఘా ఏర్పాటు చేశారు. చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయడం, ఎక్కడిక్కడ తనిఖీలు చేయడం చేస్తూ మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ఇప్పటికే చేపట్టారు.

Read More
Next Story