
జగన్ మందు తాగినోళ్లు మంచానపడ్డారు
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సరఫరా చేసిన మందు తాగినోళ్లలో చాలా మందికి కిడ్నీలు పాడయ్యాయి, నరాలు జబ్బులొచ్చాయి....
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నపుడు 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లిక్కర్ అవుట్ లెట్ ల నుంచి కొని తాగిన లిక్కర్, కల్తీ మద్యం వల్ల రాష్ట్రంలో కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరిగి పోయాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019–24 మధ్య కాలంలో 91వేలకు కిడ్నీ కేసులు పెరిగాయిని, అదేవిధంగా కాలేయ సంబంధిత కేసులు కూడా విపరీతంగా పెరిగాయని అయన అన్నారు. వీటితో పాటుగా న్యూరో సంబంధిత కేసులు కూడా 380 నుంచి 7,800 వరకు పెగినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం 2014–19 కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో నమోదయినవి కేవలం 49వేల కిడ్నీ కేసులే నని మంత్రి చెప్పారు.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా అత్యున్నత సేవలు అందించిన నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల అవార్డులను అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ఈ వివరాలు వెల్లడించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరిగిందని సత్యకుమార్ ఆరోపించారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి ఆధ్వర్వంలోనే సొంతంగా డిస్టలరీలు ఏర్పాటు చేసి లిక్కర్ స్కాంకు పాల్పడటం బాధాకరమని, ఇలాంటిది ఎక్కడ జరగలేదని, వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా వైసీపీ హయాంలో నాసిరకం మద్యం, కల్తీ మద్యం కారణంగా లక్షలాది మంది ప్రాణాలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెలగాటం ఆడారని విమర్శించారు. నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత బ్రాండ్లు తయారు చేయించడం విడ్డూరంగా ఉందని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది చూడలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.