
మద్యం కుంభకోణం–కోర్టుకు గోవిందప్ప
మంగళవారం మైసూర్‌లో గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో కీలక ఏ33 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని మరి కాసేపట్లో కోర్టు ముందు హజరుపరచనున్నారు. మంగళవారం సిట్ అధికారులు గోవిందప్పను అదుపులోకి తీసుకున్నారు. మైసూర్‌లో అదుపులోకి తీసుకున్న గోవిందప్పను అక్కడ నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. బుధవారం ఆయనను కోర్టులో హజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం గోవిందప్పను సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత కోర్టుకు తరలించారు.
అయితే గోవిందప్పను కోర్టులో వాహనంలో నుంచి దింపకుండానే అదే వాహనంలో సిట్ అధికారులు బయటకు తీసుకెళ్లిపోయారు. వాహనంలో ఉన్న గోవిందప్పను బయటకు కనిపించకుండా సిట్ అధికారులు తమ చేతులను అడ్డు పెట్టి గోవిందప్ప ముఖాన్ని దాచే ప్రయత్నం చేశారు. సిట్ అధికారుల వ్యవహారం కాస్త చర్చనీయాంశంగా మారింది. మరి కాసేపట్లో గోవిందప్పను సిట్ అధికారులో కోర్టులో హజరు పరచనున్నారు. అయితే గోవిందప్పకు రిమాండ్ విధిస్తుందా, పోలీసుల కస్టడీకి అప్పగిస్తుందా అనేది చర్చనీయంశంగా మారింది.