లిక్కర్‌ స్కామ్‌–విజయవాడకు ఏ40 వరుణ్‌ పురుషోత్తం
x

లిక్కర్‌ స్కామ్‌–విజయవాడకు ఏ40 వరుణ్‌ పురుషోత్తం

హైదరాబాద్‌లో వరణ్‌ పురుషోత్తంను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసు టీవీ సీరియల్‌ ఎపిసోడ్‌లు మాదిరిగా కొనసాగుతోంది. ఓ పక్క నిందితుల సంఖ్య పెరుగుతోంది. మరో పక్క విచారణలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఏ40 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వరుణ్‌ పురుషోత్తంను సిట్‌ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వరణ్‌ పురుషోత్తంను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న సిట్‌ అధికారులు విచారణ నిమిత్తం విజయవాడ సిట్‌ కార్యాలయానికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఈ మద్యం కుంభకోణం కేసులో వరణ్‌ పురుషోత్తం చాలా కీలకమైన వ్యక్తిగా సిట్‌ అధికారులు భావిస్తున్నారు. ఇది వరకే వరణ్‌ పురుషోత్తం నుంచి సిట్‌ అధికారులు చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. విజయవాడ కోర్టు వరణ్‌ పురుషోత్తంపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను కూడా జారీ చేసింది. మద్యం కుంభకోణం నేరాన్ని అంగీకరించి వాస్తవాలను వరణ్‌ పురుషోత్తం వెల్లడించడంతో లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన భారీ నగదు నిల్వలు ఎక్కడున్నాయనే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సిట్‌ అధికారులు భావిస్తున్నారు. వరణ్‌ పురుషోత్తం సిట్‌ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హైదరాబాద్‌లోని సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కాచారం సులోచన ఫార్మ్‌గెస్ట్‌హౌస్‌లో ఈ అక్రమ మద్యం నిల్వల డంప్‌ ఉన్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. 12 అట్టపెట్టెల్లో దాచిపెట్టిన రూ. 11 కోట్ల నగదును సిట్‌ అధికారులు సీజ్‌ చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డి ఆదేశాల మేరకే 2024 జూన్‌లో వరణ్‌ పురుషోత్తం రూ. 11 కోట్ల డబ్బును 12 అట్టపెట్టల్లో పెట్టి ఆఫీసుకు సంబందించిన ఫైళ్ల మధ్య భద్రపరిచినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. భారీ స్థాయిలో డబ్బును దాచిపెట్టిన దాంట్లో చాణక్య, వినయ్‌ పాత్రలు కూడా ఉన్నాయనే అనుమానాలు సిట్‌ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు వారిని సిట్‌ అధికారులు విచారణ చేపట్టే కార్యక్రమానికి సిట్‌ అధికారులు ఉపక్రమించినట్లు తెలిసింది.
Read More
Next Story