తిరుపతి వేదిక్ యూనివర్సిటీ లో చిరుత, విద్యార్థుల్లో టెన్షన్, టెన్షన్
x

తిరుపతి వేదిక్ యూనివర్సిటీ లో చిరుత, విద్యార్థుల్లో టెన్షన్, టెన్షన్

చిరుత సంచరిస్తున్న ప్రాంతం లో సీసీ కెమెరాలు, రెండు బోన్లు ఏర్పాటు


తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర, వేదిక్, అగ్రికల్చర్ యూనివర్సిటీలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలు, రెండు బోన్లు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా చిరుతలను బంధించకపోవడం ఆందోళన పెంచుతోంది. రాత్రి వేదిక్ యూనివర్సిటీలో ఓ చిరుత సేదతీరుతూ విద్యార్థుల కంటపడింది. 3 నెలలు అవుతున్నా చిరుతలను పట్టుకోలేకపోతున్నారని. విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తరచూ భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ తిరుగుతున్నారు. కుక్కలు, దుప్పిలు, జింకలు కోసం చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని సమాచారం.

అటవీ శాఖ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది మరింత చొరవ తీసుకుని చిరుతలను బంధించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు. కనుక రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వర్సిటీ రోడ్డుపైన సంచరించడంపై నిషేధం ఉంది. ఇది అతిక్రమిస్తే జరిగే పరిణామాలకు ఎస్వీ యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదని హెచ్చరికలో బోర్డులో పేర్కొన్నారు. అత్యవసరమైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ను, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌ను సంప్రదించాలని వారి కాంటాక్ట్ నెంబర్స్ ఫ్లెక్సీలో ఇచ్చారు. అలాగె అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక మార్గం మధ్యలో ఇటీవల చిరుత సంచరించడం కొందరు చూశారు. అర్ధరాత్రి సమయంలో గాలిగోపురం సమీపంలోని దుకాణం ఎదురుగా రోడ్డుపై చిరుత కనిపించింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ఆ షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలోని దుకాణదారులను అప్రమత్తం చేశారు.

అంతకుముందు ఇదే నెలలో ఏడో మైలు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించి దానిని తిరిగి అడవిలోకి పంపించేశారు. తిరుమలకు వచ్చే కాలినడక భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిత్యం పర్యవేక్షిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు. భక్తులను గుంపులు గుంపులుగా నడక మార్గంలో అమనుతిస్తున్నారు.12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి నడక మార్గంలో అనుమతించడం లేదు భక్తులను ఒక్కసారి 70, 80 మందిని, లేక 100 మంది వరకు నడక మార్గంలో గుంపులు గుంపులుగా అనుమతిస్తున్నారు. గుంపులుగా ఉంటే చిరుత దాడి చేసే అవకాశాల తక్కువ ఉంటాయని టీటీడీ అధికారులు, అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.


Read More
Next Story