నిరుద్యోగులకు శుభవార్త, 25,487 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్
x

నిరుద్యోగులకు శుభవార్త, 25,487 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్

డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్, 10వ తరగతి పాసైతే చాలు


BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCB విభాగాల్లో మొత్తం 25,487 ఉద్యోగాల భర్తీ కోసం కొత్తగా SSC GD కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 1 నుంచి 31 డిసెంబర్ వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్లో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు.

SSC GD భర్తీ 2025 కి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్హత, ఫీజు, వయస్సు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Staff Selection Commission (SSC), SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ -2025 ముఖ్య తేదీలు
నోటిఫికేషన్ విడుదల: 01 డిసెంబర్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 01 డిసెంబర్ 2025
దరఖాస్తుల చివరి తేదీ: 31 డిసెంబర్ 2025
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01 జనవరి 2026
కరెక్షన్ తేదీలు: 08 – 10 జనవరి 2026
ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్: పరీక్షకు ముందు విడుదల
ప్రిలిమ్స్ పరీక్ష: ఫిబ్రవరి – ఏప్రిల్ 2026
ప్రిలిమ్స్ ఫలితాలు: త్వరలో వెల్లడిస్తారు
అభ్యర్థులు ఎల్లప్పుడూ SSC అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలను నమ్మవద్దు.

దరఖాస్తు ఫీజు
General / OBC: ₹100
SC / ST / PH: ₹0
మహిళలందరికీ: ₹0
చెల్లింపు విధానం:
క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ — ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
వయస్సు పరిమితి (01.01.2026 నాటికి)
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ఠ వయస్సు: 23 సంవత్సరాలు
వయస్సు సడలింపు నిబంధనలు అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్నాయి. వాటిని కూడా చూడండి.
మొత్తం ఖాళీలు – 25,487 పోస్టులు
క్యాటగిరీల వారీగా పోస్టులు
BSF: 616
CISF: 14,595
CRPF: 5,490
SSB: 1,764
ITBP: 1,293
Assam Rifles (AR): 1,706
SSF: 23
NCB: (పోస్టులు వివరాలు నోటిఫికేషన్‌లో)
మొత్తం: 25,487
అర్హత వివరాలు
భారతదేశంలోని ఏ గుర్తింపు పొందిన బోర్డు / సంస్థ నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత తప్పనిసరి.
SSC GD కానిస్టేబుల్ – కేటగిరీ వారీ ఖాళీలు
కేటగిరీ పురుషులు మహిళలు
General 10,198 904
EWS 2,416 189
OBC 5,329 436
ST 2,091 222
SC 3,433 269
మొత్తం 23,487 2,020
గ్రాండ్ టోటల్ 25,487 పోస్టులు
SSC GD కానిస్టేబుల్ జీతం 2025
విభాగం మొత్తము (₹)
బేసిక్ పే ₹21,700 – ₹69,100
గ్రేడ్ పే ₹2,000
డియర్‌నెస్ అలవెన్స్ (DA) ₹21,700
హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) ₹10,850
ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ₹2,170 – ₹6,510
ప్రభుత్వ NPS కాంట్రిబ్యూషన్ ₹1,800 – ₹5,400
గ్రాస్ జీతం: ₹41,077 – ₹45,417
డిడక్షన్స్: ₹3,535
చేతికి వచ్చే జీతం: ₹32,985 – ₹37,325
ఎంపిక విధానం (Selection Process)
లిఖిత పరీక్ష (CBT)
PET / PST (శారీరక పరీక్షలు)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ టెస్ట్
SSC GD కానిస్టేబుల్ 2025 – ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా దరఖాస్తు చేయాలి. ప్రక్రియ ఇలా ఉంటుంది:
ముందుగా SSC GD 2025 నోటిఫికేషన్ PDF పూర్తిగా చదవాలి.
క్రింద ఇచ్చిన “Apply Online” లింక్ లేదా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూరించాలి.
అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
ఫీజు చెల్లించాలి.
చివరగా అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.

పదో తరగతి విద్యార్హతపై భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు డిసెంబర్‌ 1 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 1న రాత్రి 11గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు అప్లికేషన్‌లో పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగ నియామక పరీక్షలు ఫిబ్రవరి - ఏప్రిల్‌ మధ్య తేదీల్లో జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది.
Read More
Next Story