
చనిపోయిన బడిపిల్లల నివాళులర్పించిన డిఇవొ
నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం..
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ప్రమాదవశాత్తు ఆరుగురు విద్యార్థుల మృత్యు వాతను జీర్ణించుకోలేని జిల్లా డీఈవో జిల్లా విద్యాధికారి ఎస్ శ్యామ్యూల్ పాల్ హుటాహుటిన వెళ్ళి ఆ గ్రామాన్ని సందర్శించారు.
పిల్లల కుటుంబ సభ్యుల దుఃఖాన్ని తీర్చే ప్రయత్నం చేశారు. ఆ దుఃఖం ఆ శోకం వర్ణించలేనిదే ఐనా వారిని ఓదార్చి వారికి అండగా నిలిచారు.
ఏ జిల్లా అధికారి కూడా ఇలా స్పందించరు. స్థానిక ఎంఈఓ ను పంపి నివాళులు అర్పించమని సంతాపం ప్రకటించమని ఆదేశిస్తారు. కానీ శామ్యూల్ పాల్ అలా చేయలేదు. ప్రమాదంలో మరణించిన ఎర్రబాట శశికుమార్(10), ఎర్రబాట కిన్నెరసాయి(10), కేసరం సాయికిరణ్ (10), ఉప్పలపాటి బీమా (10), గడ్ల వినయ్ (10), షేక్ మహాబూబ్ (10) ల భౌతిక కాయం పై పూలమాలలు వేసి కన్నీరు మున్నీరయ్యారు.
ఆస్పరి మండలం చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న కుంట వద్దకు వెళ్లారు. అక్కడ ఈతకొడదామని ఒకరికి ఒకరు అనుకుని కుంటలోకి దిగారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలో భారీగా నీరు చేరింది. పిల్లలకు లోతు తెలియకపోవడంతో కాళ్లు కిందకు అందక నీటిలో మునిగిపోయారు.
జిల్లా డీఈవోగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తన విధుల్లో అంకితభావంతో నిబద్ధతతో పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, సమాజానికి దగ్గరయ్యే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయాన్ని కుటుంబాలకు అండగా నిలుస్తానని మాట ఇచ్చారు.
Next Story