కేటీఆర్ కారుపై దాడి
x

కేటీఆర్ కారుపై దాడి

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై దాడి జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ముషీరాబాద్ గుండా వెళుతున్న కేటీఆర్ కారును కాంగ్రెస్ క్యాడర్ దాడిచేసింది.


బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై దాడి జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ముషీరాబాద్ గుండా వెళుతున్న కేటీఆర్ కారును ఒక్కసారిగా కాంగ్రెస్ క్యాడర్ దాడిచేసింది. మూసీ బాధితులను పరామర్శించేందుకు పార్టీ నేతలతో కలిసి వెళుతున్న కేటీఆర్ కారుకు ముషీరాబాద్ లో కాంగ్రెస్ నేతలు, క్యాడర్ అడ్డుకున్నారు. వేగంగా ప్రయాణిస్తున్న కారుకు ఒక్కసారిగా హస్తంపార్టీ క్యాడర్ అడ్డంపడ్డారు. దాంతో కేటీఆర్ తన కారును నిలిపేయాల్సొచ్చింది. వెంటనే రోడ్డుకు పక్కగా నిలబడుతున్న మరికొంతమంది కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వచ్చి కారును చుట్టుముట్టారు.

కొందరైతు ఏకంగా కారుపైకి ఎక్కేసి నానా గోలచేశారు. మరికొందరు కార్యకర్తలు కారుకు ముందు రోడ్డుపైనే పడుకుని కదలకుండా అడ్డుకున్నారు. మిగిలిన వారు కురును చుట్టుముట్టి నానా గలబా చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి కార్యకర్తలను పక్కకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయటంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కారు అద్దాలు పగలగొట్టి కేటీఆర్, నేతలపై దాడిచేస్తారో అని జనాలు భయపడిపోయారు. అయితే వాళ్ళకి పోలీసులు అలాంటి అవకాశం ఇవ్వకుండా అక్కడినుండి చెదరగొట్టేశారు.

నిజానికి కాంగ్రెస్ క్యాడర్ కేటీఆర్ ను అడ్డుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మూసీనదికి రెండువైపుల దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న వాళ్ళని ఉన్నపళంగా ఇళ్ళను ఖాళీ చేసి వెళ్ళిపొమ్మని అధికారులు చెప్పటంతోనే గొడవలు మొదలయ్యాయి. తప్పులన్నీ ప్రభుత్వం వైపు జరగటంతో ప్రతిపక్షాలు సహజంగానే ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇందులో కేటీఆర్ను తప్పుపట్టాల్సిన అవసరం ఏమీలేదు. తప్పులు చేసిన ప్రభుత్వం తనంతట తానుగానే ప్రతిపక్షాలకు అస్త్రాలను చేతికి అందించింది. దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటున్నాయి. బాధితులున్నపుడు ప్రతిపక్షాల నేతలు వాలిపోవటం చాలా సహజం.

ఇపుడు కేటీఆర్ అదే పనిచేస్తుంటే దాన్ని కాంగ్రెస్ క్యాడర్ తట్టుకోలేకపోతుండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. రోడ్లపైన కేటీఆర్ ను అడ్డుకుంటే ప్రభుత్వానికి అయినా పార్టీకి అయినా వచ్చే ఉపయోగం ఏమీలేదు. కార్యకర్తలకు చేతనైతే బాధితుల తరపున ప్రభుత్వానికి సమస్య బోధపడేట్లుగా చెబితే బాగుంటుంది. అలా చేయలేనపుడు ప్రతిపక్షాలకు అడ్డుపడకుండా ఉండాలంతే.

Read More
Next Story