తన పేరుకు ఎన్టీఆర్ కు సంబంధమే లేదు (వీడియో)
జరుగుతున్న ప్రచారం ఏమిటంటే అన్నగారు నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్)మీద ఉన్న అభిమానంతోనే కేసీఆర్ తన కొడుకుకి తారకరామారావు అని పేరు పెట్టారని.
జరుగుతున్న ప్రచారం ఏమిటంటే అన్నగారు నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్)మీద ఉన్న అభిమానంతోనే కేసీఆర్ తన కొడుకుకి తారకరామారావు అని పేరు పెట్టారని. తారకరామారావు ఇంటిపేరుతో కలిపి కల్వకుంట్ల తారకరామారావు అలియాస్ కేటీఆర్ అయ్యారని. తెలంగాణాలోనే కాదు ఏపీలో కూడా చాలామందిలో ఇలాంటి అభిప్రాయమే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీ స్ధాపించినపుడు కేసీఆర్ కూడా చేరారు. తర్వాత అంచలంచెలుగా ఎదిగి పార్టీలో కీలకపాత్ర పోషించారు. టీడీపీలో జరిగే శిక్షణా తరగతుల నిర్వహణలో కేసీఆర్ చాలా చురుకైన పాత్ర పోషించారు.
అన్న ఎన్టీయార్ తో కేసీఆర్ కు సుదీర్ఘమైన అనుబంధం ఉండటం, పార్టీలో కీలకపాత్ర పోషించటం తదితరాలతో అన్నగారి పేరునే కేసీఆర్ కొడుక్కి తారకరామారావు అని పేరు పెట్టుకున్నారనే ప్రచారం విస్తృతంగా బలపడిపోయింది. అయితే ఒక ఛానల్లో కేటీఆర్ ఈ విషయమై క్లారిటి ఇచ్చారు. ఎన్టీఆర్ పేరుకు తన పేరులో తారకరామారావు అని ఉండటానికి ఎలాంటి సంబంధంలేదన్నారు. ఎన్టీఆర్ పేరును తనకు పెట్టలేదని చెప్పారు. తారకరామారావు అనే పేరును తన తండ్రి కాదని తాతగారు పెట్టారని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. తనపేరుకు నందమూరి తారకరామారావు పేరుకు ఎలాంటి సంబంధంలేదన్నారు.
— K Phani Kumar (@KPhaniKuma69706) August 27, 2024
తనపేరును తారకరామారావు అని పెట్టడంలో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. ఎన్టీఆర్ ను స్పూర్తిగా తీసుకుని తనకు తారకరామారావు అని పెట్టలేదన్నారు. జన్మనక్షత్రం తదితరాలను చూసిన తర్వాతే తాతగారు తనకు తారకరామారావని పేరు పెట్టినట్లు చెప్పారు. తాను 1976లో పుడితే ఎన్టీఆర్ పార్టీ పెట్టింది 1982లో అని గుర్తుచేశారు. ఎన్టీఆర్ అంటే తన తండ్రి కేసీఆర్ కు ప్రత్యేకమైన అభిమానమే కాదు చాలా గౌరవం కూడా ఉందన్నారు. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని ఒక స్ధాయికి తెచ్చింది ఎన్టీఆరే అని గుర్తుచేశారు. తనపేరుకి నందమూరి తారకరామారావు పేరుకు సంబంధంలేకపోయినా తనకు కూడా తారకరామారావు అని ఉండటం మంచిదే అయ్యిందన్నారు.