
ఆగస్టు 12న ‘కోనసీమ యూత్ సమ్మిట్’
యువత నైపుణ్యాలను మరింత మెరుగు పరుచుకోవాలి అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12న రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో జరుగనున్న కోనసీమ యూత్ సమ్మిట్ పోస్టర్ ను బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ., యువత నైపుణ్యాలను మరింత మెరుగు పరుచుకోవాలన్నారు. యువత లో దాగి ఉన్న టాలెంట్ ను, స్కిల్స్ ను రాష్ట్ర భవిష్యత్ అవసరాల కోసం వినియోగించుకోవలన్నారు. ఇలాంటి వాటి కోసం కోనసీమ యూత్ సమ్మిట్ వంటి కార్యక్రమాలు దోహద పడతాయన్నారు.
యువత తమ ఆలోచనలు వ్యక్తపరచడానికి యూత్ సమ్మిట్ సరి అయిన వేదికగా ఉపయోగపడుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అభివృద్ధి అజెండాగా భవిష్యత్ ప్రణాళికలు చర్చించడంతో పాటు, యువత లోని నాయకత్వ లక్షణాలు, పరిస్థితులకు తగినట్లు వేగంగా నిర్ణయాలు తీసుకునే ఆలోచన విధానాలను యూత్ సమ్మిట్ వంటి కార్యక్రమాల ద్వారా యువత అలవర్చు కోవాలని ఆయన సూచించారు. యువతకు ఎంతో ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమ నిర్వహణ కు నడుబిగించిన మంత్రి సుభాష్ ను ఈ సందర్బంగా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. కేబినెట్ సమావేశానికి ముందు జరిగిన ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, సవిత, గుమ్మిడి సంధ్యారాణి, అనగాని సత్య ప్రసాద్, రామ్‌ప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.