
తెలంగాణలో ముక్కోడు పోయిండు..ఆంధ్రలో తిక్కోడు పోయిండు
తెలంగాణ తెలుగుదేశం నాయకుడు నర్సిరెడ్డి తన పంచ్ డైలాగులతో మహానాడులో నవ్వులు పూయించారు.
కడప మహానాడులో తెలంగాణకు చెందిన టీడీపీ నాయకుడు నర్సిరెడ్డి ప్రాసల ప్రసంగానికి వేదికపైన ఉన్న నాయకులు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫిదా అయ్యారు.
నర్సిరెడ్డి మరో సారి తన ప్రాసల ప్రసంగంతో తన ప్రతాపాన్ని చూపించారు, పంచ్ డైలాగులతో అందరినీ ఆకట్టుకున్నారు. భారత రాజకీయా ధృవతార అంటూ చంద్రబాబును, నిందలు అపనిందలు, దాడులు ఎదురు దాడుల మధ్య ఎదిగి, యువగళమై, నవగళమై, జన బలంతో సాగుతున్న మన నేత, యువనేత లోకేష్ అంటూ ఎంట్రీలోనే అదిరిపోయే డైలాగులతో టీడీపీ శ్రేణులను ఆకట్టుకున్నారు. చెట్టు మీద ఉండే పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు, తన రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని, బలగాన్ని నమ్ముకుంటుంది, కార్యకర్తలే టీడీపీకి ఇందనం, అందుకే కార్యకర్తలకే తొలివందనం అంటూ డైలాగు పేల్చడంతో టీడీపీ శ్రేణులు ఓ రేంజ్‌లో ఈలలు, చప్పట్ల వర్షం కురిపించారు.
తన పంచ్‌లను అలానే కొనసాగిస్తూ.. మాకాడా ముక్కోడు పోయిండు, మీకాడ తిక్కోడు పోయిండు..ఇవాళ ముక్కాయనేమో లిప్ట్ ఇరిగేషన్, తిక్కాయనేమో ఆత్మలతో మాట్లాడే పరిస్థితి ఏర్పడ్డది అంటూ ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ గురించి, ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోయిన జగన్‌మోహన్‌రెడ్డి గురించి చెప్పడంతో ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది.
తెలుగు జాతి..విశ్వఖ్యాతి అనే తీర్మానంపై నర్సిరెడ్డి మాట్లాడుతూ ఓ రేంజ్‌లో ప్రసా పదాలు, పంచ్ డైలాగులను పేల్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన విధానం గురించి, టీడీపీ ఆవిర్భావం గురించి, ఎన్టీఆర్ గొప్పతనం గురించి ఆయన చెప్పిన పంచ్‌డైలాగులు మహానాడులో టీడీపీ శ్రేణులను ఓ రేంజ్ అలరింప చేశాయి. పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణాగారిన జనాల అభివృద్ధి కోసం, ఆదర్శవంతమైన విధానాల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని గుక్క తిప్పుకోకుండా చెప్పిన మాటలు టీడీపీ శ్రేణులను ఉత్తేజపరిచాయి.
ఇంకా తన ప్రాస పంచ్ డైలాగులను నర్సిరెడ్డి కొనసాగిస్తూ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత గ్రామాలకు మౌలిక సదుపాయాలందాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలందాయి, ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది, సామాజిక మార్పులకు స్వాగతం పలికాం, ఆర్థిక అభివృద్ధిక అందలమేశాం, బడుగు జాతుల ఉద్దరణ కోసం బాటలు వేశాం అంటూ నర్సిరెడ్డి చెప్పిన పంచ్ డైలాగులకు వేదికపైన ఉన్న చంద్రబాబు, నారా లోకేష్‌తో పాటు ఇతర సీనియర్ నాయకులు, వేదిక ముందున్న టీడీపీ శ్రేణులు ఫిదా అయ్యారు.
Next Story