Kavitha|తెలంగాణాతల్లి కోసం గునపమెత్తిన కవిత
జగిత్యాల(Jagityala)లో తెలంగాణాతల్లి విగ్రహం (Telangana Talli Statue)ఏర్పాటుకు సంబంధించిన భూమిపూజ కార్యక్రమంలో ఆదివారం కవిత పాల్గొన్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత కల్వకుంట్లకవిత ప్రజాజీవితంలోకి మళ్ళీ అడుగుపెట్టారు. అదికూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంతో తన రీఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే జగిత్యాల(Jagityala)లో తెలంగాణాతల్లి విగ్రహం (Telangana Talli Statue)ఏర్పాటుకు సంబంధించిన భూమిపూజ కార్యక్రమంలో ఆదివారం కవిత పాల్గొన్నారు. పాల్గొనటమే కాదు భూమిపూజలో భాగంగా స్వయంగా గునపంతో భూమిని తవ్వారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ప్రభుత్వం తెలంగాణాతల్లి(కాంగ్రెస్ మాత)కోసం ఎన్ని జీవోలు ఇచ్చినా వాటిని లెక్కచేసేదిలేదన్నారు. జీవోల థిక్కారణ కార్యక్రమంలో పాల్గొనటంలో భాగంగానే జగిత్యాలలో ఏర్పాటు చేయబోతున్న 22 అడుగుల ఉద్యమ తెలంగాణాతల్లి విగ్రహ ప్రతిష్టాపన భూమిపూజకు నడుంబిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఏర్పాటుచేసిన తెలంగాణా తల్లిని ఎట్టిపరిస్ధితుల్లోను అంగీకరించే ప్రసక్తేలేదన్నారు.
ఉద్యమ తెలంగాణాతల్లి విగ్రహాలనే గ్రామగ్రామాన ప్రతిష్టించుకుంటామని కవిత(Kavitha) చెప్పారు. తెలంగాణాతల్లి ఏర్పాటుపై ప్రభుత్వం జారీచేసిన జీవోలను లెక్కచేసేదిలేదని, ఆందోళన కార్యక్రమాల్లో కేసులుపెట్టినా భయపడేదిలేదని కూడా హెచ్చరించారు. తమందిరికీ ధైర్యాన్ని, స్పూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణాతల్లినే ఆరాధిస్తామని మరోసారి చెప్పారు. తెలంగాణాతల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామని కూడా తెగేసిచెప్పారు. తెలంగాణా అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామగ్రామాన ఎండగడతామని కవిత వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణాతల్లి చేతిలోని బతుకమ్మను తీసేయటం ద్వారా తెలంగాణాలోని మహిళలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth reddy Government) అవమానించిందని మండిపడ్డారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణాతల్లి విగ్రహాన్నిఆవిష్కరించిందో ఆప్పటినుండే కవిత ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అంతకుముందు నుండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao) కొద్దిరోజులుగా ఇలాంటి వ్యతిరేక వైఖరినే ప్రదర్శిస్తున్న విషయాన్ని జనాలందరు గమనిస్తున్నదే. తాము అధికారంలోకి రాగానే రేవంత్ ఆవిష్కరించిన తెలంగాణాతల్లి విగ్రహాన్ని తీసి గాంధీభవన్(Gandhi Bhavan) కు పంపిస్తామని కూడా హెచ్చరించారు. ఇదే సమయంలో కవిత మాత్రం తన సంస్ధ జాగృతి ద్వారా గ్రామగ్రామాన రేవంత్ ఆవిష్కరించిన తెలంగాణాతల్లి విగ్రహానికి వ్యతిరేకంగా జనాల మద్దతును కూడగడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటుచేసిన తెలంగాణాతల్లి విగ్రహాలను వేలకువేలుగా తయారుచేయిస్తామని, వాటిని ఊరూరా ప్రతిష్టిస్తామని పదేపదే హెచ్చరిస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణా ఏర్పాడిన తర్వాతే బతుకమ్మ పండుగకు ఒక ఊపొచ్చింది. ఆఊపు కూడా అచ్చంగా కవిత ద్వారానే సాధ్యమైందని అందరికీ తెలిసిందే. అంతకుముందు కూడా బతుకమ్మ పండుగ(Batukamma Festival)ను మహిళలు జరుపుకునేవారు కాని ఎక్కడికక్కడ చాలా చిన్న పరిధిలో మాత్రమే జరుపుకునేవారు. తెలంగాణా ఏర్పడిన తర్వాత జాగృతి సంస్ధ(Jaagruthi) ద్వారా కవిత బతుకమ్మ పండుగను భారీస్ధాయిలో నిర్వహించారు. దాంతో గ్రామీణ ప్రాంతాల మహిళలు మాత్రమే కాదు పెద్ద పట్టణాలు, జిల్లా కేంద్రాలే కాకుండా హైదరాబాదు(Hyderabad) నగరంలో కూడా బతుకమ్మను పెద్ద పండుగగా నిర్వహించటం మొదలైంది. ఈ క్రెడిట్ మొత్తం కవితకే దక్కుతుందనటంలో సందేహంలేదు. అందుకనే ఇపుడు రేవంత్ ఆవిష్కరించిన తెలంగాణాతల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవటంతో కవిత మండిపోతున్నారు. అందుకనే ఉద్యమ తెలంగాణాతల్లి విగ్రహాల ఏర్పాటుకు కవిత నడుంబిగించారు. మరి ఎన్ని విగ్రహాలను ఏర్పాటుచేయిస్తారో చూడాలి.