కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి ఘోర అవమానం, కుర్చీ లాగేశారు!
కడప తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవీరెడ్డికి ఘోర అవమానం జరిగింది. సాక్షాత్తు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఈ అవమానం జరిగింది. అసలేం జరిగిందంటే..
కడప తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవీరెడ్డికి ఘోర అవమానం జరిగింది. సాక్షాత్తు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఆమెకు అవమానం జరిగింది. దీంతో సమావేశంలో రసాభాస జరిగింది. అసలేం జరిగిందంటే..
కడప మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ వాళ్ల ఆధీనంలో ఉంది. ఈవేళ అంటే నవంబర్ 7 మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హోదాలో టీడీపీ సభ్యులిద్దరు హాజరయ్యారు. కార్పొరేటర్లు అందరూ వారి వారి సీట్లలో కూర్చుని ఉన్నారు. కడప జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. అయితే అక్కడ వారికి కూర్చోవడానికి ఎక్కడా కుర్చీలు కనిపించలేదు. టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి చాలా సేపు నిలబడే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు కుర్చీలు వేసినా వాటిని వైసీపీ మేయర్ తీసివేయించినట్టు టీడీపీ సభ్యులు ఆరోపించారు. అయినప్పటికీ ఆమె అక్కడి నుంచి వెళ్లలేదు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిల్చొని నిరసన తెలిపారు.
ఆమెకి మైకు ఇవ్వడం పట్ల కొందరు వైసీపీ సభ్యులు ఆక్షేపణ కూడా తెలిపారు. మరోవైపు ఆమె మాట్లాడుతుండగా మేయర్ సురేశ్, కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్‌గా మాట్లాడే అవకాశం ఉందని, అందుకే మాట్లాడతానంటూ మాధవి పట్టుబట్టారు. ఈ సందర్భంలో మాటామాటా పెరిగింది. సమావేశంలో గందరగోళం జరిగింది.
ఈ సందర్భంగా మాధవీరెడ్డి ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. పాలకవర్గం తీరుపై మండిపడ్డారు. ‘‘మహిళను అవమానిస్తారా? మీరు లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు. కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదు. సమావేశమంతా నిల్చొని మాట్లాడే శక్తి నాకుంది. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నాం’’ అని మాధవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈలోపు టీడీపీ కార్యకర్తలు, ఆమె అభిమానులు, అనుచరులు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వద్ద పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశంలో మాధవీరెడ్డి నిల్చొనే మాట్లాడి తన నిరసన తెలిపారు. ఆమె అనుచరులు కార్పొరేషన్ మేయర్ సురేశ్ తీరును తప్పుబట్టారు. ఆయనపై జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు.
Next Story