ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం
x

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం

ఏపీ సచివాలయంలో íసీఎస్‌ కే విజయానంద్‌ అధ్యక్షతన బుధవారం ఏపీ సచివాలయంలో ఈ సమావేశం అయ్యారు.


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ అధ్యక్షతన రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభంమైంది. ఈసమావేశంలో సర్వీసెస్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి,టి ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, పిఆర్‌ అండ్‌ ఆర్టీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీ రావు, కళాశాల విద్యా డైరెక్టర్‌ భరత్‌ గుప్త, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్‌ అల్లాడ వంటి పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నుండి ఏపీ ఎన్జీజీజీఓ, రాష్ట్ర టీచర్స్‌ యూనియన్, ఏపీ ప్రోగ్రస్సివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్, ఏపీ యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్, ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం, ఏపీ అన్ని ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సెంట్రల్‌ అసోసియేషన్, ఆల్‌ ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంటు క్లాస్‌ 4 ఉద్యోగుల సెంట్రల్‌ అసోసియేషన్, ఏపీ కో ఆపరేటివ్‌ సర్వీస్‌ అసోసియేషన్, ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ప్రత్యేక ఆహ్వానితులు),ది స్టేట్‌ గవర్నమెంట్‌ సెన్సర్స్‌ అసోసియేషన్‌ ఎపి (ప్రత్యేక ఆహ్వానితులు) అధ్యక్షత, జనరల్‌ సెక్రటరీలు మరియు ఎపి సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీహాజరయ్యారు.

Read More
Next Story