పోలీసుల అదుపులో జానీ
x

పోలీసుల అదుపులో జానీ

గురువారం ఉదయం మొబైల్ సిగ్నల్ ఆధారంగా జానీని గుర్తించిన పోలీసులు చివరకు బెంగుళూరులో అదుపులో తీసుకున్నట్లు తెలుస్తున్నది.


కోరియాగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీని పోలీసులు బెంగుళూరు/గోవాలో పట్టుకున్నట్లు సమాచారం. తనను లైగింకంగా వేధించాడని, తనపై అత్యాచార ప్రయత్నాలు చేసినట్లు జానీకి అసిస్టెంటుగా పనిచేసిన ఒక మహిళా కోరియోగ్రాఫర్ ఫిర్యాదుచేసింది. జూనియర్ కోరియోగ్రాఫర్ ఫిర్యాదు ఆధారంగా జానీపై పోలీసులు కేసు నమోదుచేశారు. తాను మైనర్ గా ఉన్నపుడే జానీ అత్యాచార ప్రయత్నం చేసినట్లు సదరు జూనియర్ ఫిర్యాదు చేయటంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.

ఎప్పుడైతే తనపైన కేసులు నమోదైంది అని తెలుసుకున్నాడో అప్పటినుండే జానీ పరారీలో ఉన్నాడు. జానీని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను పోలీసు ఉన్నతాధాకారులు ఏర్పాటుచేశారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా జానీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నాడని, లడ్డాక్ లో ఉన్నాడని పోలీసులు వెతుకుతున్నారు. మరో బృందం బెంగుళూరు, గోవాలో వెతుకుతున్నది. ఇంకో బృందం నెల్లూరు, గుంటూరులో గాలిస్తున్నది. గురువారం ఉదయం మొబైల్ సిగ్నల్ ఆధారంగా జానీని గుర్తించిన పోలీసులు చివరకు బెంగుళూరులో అదుపులో తీసుకున్నట్లు తెలుస్తున్నది. అక్కడినుండి సాయంత్రానికి హైదరాబాద్ కు తీసుకు రావటానికి పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Read More
Next Story