
‘హలాల్ చేసి చంపేస్తున్నారు’ : జీవన్ రెడ్డి సంచలనం
జగిత్యాల (Jagityal)నియోజకవర్గంలోని బీఆర్ పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాస్ధానం ఆలయకమిటి నియామకంపై మండిపోయారు
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగిత్యాల (Jagityal)నియోజకవర్గంలోని బీఆర్ పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాస్ధానం ఆలయకమిటి నియామకంపై మండిపోయారు. ఆలయకమిటిలో తాను సిఫారసుచేసిన వారిపేర్లను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. నియోజకవర్గంలో కమిటిలు, కాంట్రాక్టులన్నీ బీఆర్ఎస్(BRS) నుండి వచ్చిన ఫిరాయింపు(BRS defection MLA Sanjay) ఎంఎల్ఏ సంజయ్ కుమార్ ఇష్టప్రకారమే జరుగుతోందని రెచ్చిపోయారు. కమిటి ప్రమాణస్వీకారానికి హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Laxman) కుమార్ తో మాట్లాడుతు పార్టీ తీరుపై తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. అన్నింటిలోను ఫిరాయింపు ఎంఎల్ఏకే ప్రధాన్యత ఇస్తే పార్టీలో తనస్ధానం ఏమిటో చెప్పాలని నిలదీశారు.
తాము వలసదారులంకామని మొదటినుండి పార్టీనే నమ్ముకుని ఉన్నవాళ్ళమని పార్టీ గుర్తించటంలేదన్న ఆవేధనను వ్యక్తంచేశారు. ‘తనను హలాల్ చేసి కొంచెంకొంచెం చంపేస్తున్నారంటు’ మండిపోయారు. మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అడ్లూరి అడ్డుకోకపోయుంటే కథ ఈపాటికి వేరేరకంగా ఉండేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను కౌలుదారుడిని కాదని, పట్టాదారుడినని గట్టిగా చెప్పారు. ఆవేధనను గ్రహించిన అడ్లూరి ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకుని వెళతానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మేకను బలిచ్చినట్లు ఇచ్చారంటూ ఘాటుగా స్పందించారు. అడ్లూరి లక్ష్మన్తో తన ఆవేదను పంచుకున్నారు. #Congress #Jeevanreddy #adlurilakshman pic.twitter.com/mhd7h8mIcW
— Subbu (@Subbu15465936) October 21, 2025
జీవన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు పార్టీలో సంచలనంగా మారాయి. అనేక కారణాల వల్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై జీవన్ బాగా అసంతృప్తితో ఉన్నారు. తనకు ఎంఎల్సీ పదవిని రెన్యువల్ చేయకపోవటం, ఎంఎల్సీగా ఉన్నరోజుల్లో మంత్రివర్గంలోకి తీసుకోకపోవటంలాంటి అనేక కారణాలతో తీవ్రఅసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. వీటన్నింటికీ అదనంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన సంజయ్ మాట నియోజకవర్గంలో ఎక్కువగా చెల్లుబాటు అవుతోంది. ఇదేసమయంలో ఫిరాయింపు ఎంఎల్ఏ మద్దతుదారులకు జీవన్ మద్దతుదారులకు మధ్య రెండుమూడుసార్లు గొడవలయ్యాయి. ఒకగొడవలో జీవన్ ముఖ్య అనుచరుడు మరణించాడు. దాంతో అప్పటినుండి ఫిరాయింపు ఎంఎల్ఏ అంటేనే జీవన్ మండిపోతున్నారు.
ఇలాంటి అనేక కారణాలతో రేవంత్ అంటేనే జీవన్ నిత్య అసంతృప్తిగా మారిపోయారు. పార్టీ సమవేశాలు ఎప్పుడు జరిగినా ఏదో ఒక మాటచెప్పి లేదా ఆరోపణలు చేయటం ద్వారా తనలోని అసంతృప్తిని జీవన్ బయటకు వెళ్ళగక్కుతున్నారు. మరి తాజా వ్యాఖ్యల పరిణామాలు ఎలాగుంటాయో చూడాల్సిందే.