నటి నవ్వ బ్యాగులో మల్లెలు.. మెల్బోర్న్ లో లక్ష బిల్లు
x

నటి నవ్వ బ్యాగులో మల్లెలు.. మెల్బోర్న్ లో లక్ష బిల్లు

మలయాళ నటి నవ్వా నాయర్ కు ఆస్ట్రేలియాలో వింత అనుభవం


తెలుగు పాటల్లో, పద్యాల్లో, కథల్లో – మల్లెపూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్త్రీల జడలో అలంకారం.. పండుగల్లో శోభాయమానం, కవుల కలంలో మమకారానికి ప్రతీకగా నిలిచిన మల్లెపూలు… ఇప్పుడు ఒక సినీ నటికి మాత్రం లక్ష రూపాయల ఖరీదైన పూలుగా మారాయి! మలయాళ నటి నవ్యా నాయర్ ఆస్ట్రేలియా ప్రయాణంలో మల్లెపూలతో చిక్కి ఎదుర్కొన్న అనుభవం ప్రస్తుతం వైరల్ అయింది.
మల్లెపూలా, మజాకా.. లక్ష రూపాయల బిల్లా!
ఇటీవల మలయాళ నటి నవ్యా నాయర్ ఓ ఈవెంట్ కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. వెళ్తూ తన బ్యాగులో కొన్ని మల్లెపూలు పెట్టుకున్నారు. “వీటిని సిగలో పెట్టుకుంటే బాగుంటుంది” అనుకున్నారేమో కానీ.. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు మాత్రం చుక్కలు చూపించారు. అది చట్టం ఉల్లంఘన అని పట్టేశారు. జరిమానా కట్టాల్సిందేనని పట్టుబట్టారు.
ఆస్ట్రేలియాలో బయోసెక్యూరిటీ చట్టాలు చాలా కఠినమైనవి. పండ్లు, విత్తనాలు, పూలు లాంటివి తీసుకెళ్లకూడదు. వాటివల్ల తెగుళ్లు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిషేధం. అందుకే నవ్యా బ్యాగులో ఉన్న మల్లెపూలను చూసి అధికారులు నేరుగా ₹1.14 లక్షల జరిమానా వేశారు! దీంతో ఆమె లబోదిబోమన్నా కుదరదన్నారు అధికారులు.

దీంతో నవ్యా నాయర్ ఆ మొత్తాన్ని చెల్లించక తప్పలేదు. ఈ సంఘటన తర్వాత మెల్‌బోర్న్‌లో జరిగిన ఓనం కార్యక్రమంలో నవ్యా నవ్వుతూ,
“నేను తీసుకువచ్చిన మల్లెపూలు లక్ష రూపాయల ఖరీదైనవని ఇక్కడికి (ఆస్ట్రేలియా) వచ్చాకే తెలిసింది!” అని చమత్కరించారు. మన దగ్గర అయితే 20,25 రూపాయలకు దొరికే మల్లెపూలు, ఆస్ట్రేలియాలో లక్ష రూపాయలు పలికాయన్న మాట!
Read More
Next Story