
తిరుచానూరులో జనవరి నెల ఉత్సవాల సందడి.. 25న అమ్మవారి 'సప్తవాహన' సేవలు
2026 జనవరి నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు.
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 2026 జనవరి నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు. నెల పొడవునా వివిధ నక్షత్రాలు, పర్వదినాల సందర్భంగా అమ్మవారితో పాటు అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక వాహన సేవలు నిర్వహించనున్నారు.
ముఖ్యమైన ఉత్సవాల వివరాలు:
రథసప్తమి (జనవరి 25): జనవరి నెలలో అత్యంత కీలకమైన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు వరుసగా ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేరోజు ఉదయం 6 గంటలకు శ్రీ సూర్యనారాయణ స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.
గజవాహన సేవ (జనవరి 19): ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా పద్మావతి అమ్మవారు సాయంత్రం 6:45 గంటలకు విశేషమైన గజవాహనంపై ఊరేగుతారు.
సంక్రాంతి & హస్తా నక్షత్రం (జనవరి 10, 15): ఈ రోజుల్లో శ్రీ సూర్యనారాయణ స్వామి వారు సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
బలరామకృష్ణ స్వామి ఆలయంలో: జనవరి 1 , 28 తేదీల్లో (రోహిణి నక్షత్రం) రాత్రి 7 గంటలకు శ్రీకృష్ణ స్వామి వారికి తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది.
శుక్రవార ఉత్సవాలు: జనవరి 2, 9, 16, 23 , 30 తేదీల్లో (ప్రతి శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
సుందరాజస్వామి వారి సేవ (జనవరి 24): ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్వామి వారు తిరుచ్చి వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.
Next Story

