ఓజీ సినిమా హాల్లో మందు తాగవద్దంటావా?
x

'ఓజీ' సినిమా హాల్లో మందు తాగవద్దంటావా?

జనసేన నాయకుణ్ణి చితకబాదిన టీడీపీ కార్యకర్తలు!


కృష్ణాజిల్లాలో ఓ జనసేన నాయకుణ్ణి టీడీపీ కార్యకర్తలు చితకబాదారు. గుడివాడలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. జనసేన శ్రేణులు టీడీపీ నాయకులపై మండిపడుతున్నారు. ఈమేరకు గుడివాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది.
గుడివాడలో పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా ప్రదర్శన సందర్భంగా ఈ దాడి జరిగింది. జనసేన నాయకుడు, గుడివాడ చిరంజీవి యువత అధ్యక్షుడు మేక మురళీకృష్ణపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గతరాత్రి ఓజీ సినిమా ప్రదర్శన సమయంలో G3 థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సినిమా హాల్లో మద్యం సేవిస్తున్న టీడీపీ నాయకుల్ని ఉద్దేశించి 'థియేటర్‌లో ఆడవాళ్లు ఉన్నారని, మద్యం తాగవద్దని' మురళీకృష్ణ కోరాడు. అయినా వినకపోవడంతో గట్టిగా చెప్పారు.
దాంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న టీడీపీ నాయకులు.. మురళీకృష్ణపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మురళీకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. టిడిపి నేతల పై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు మురళీకృష్ణ. తన స్నేహితుల వల్లే ఈరోజు తాను ప్రాణాలతో ఉన్నానని మురళీకృష్ణ వాపోయారు. అయితే మురళీ కృష్ణ ఆరోపణలను టీడీపీ శ్రేణులు ఖండించాయి.
Read More
Next Story