‘జగన్ నా నాలుగో పెళ్ళాం’
x

‘జగన్ నా నాలుగో పెళ్ళాం’

సీఎం జగన్‌పై జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా నాలుగో పెళ్ళాం జగన్ అంటూ..


‘జగన్ నువ్వు నా నాలుగో పెళ్ళాం’ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పవన్ తన రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రత్యర్థులు ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపిన ఏకైక అంశం ఆయన వివాహాలే. ఈ విషయంపై మాట్లాడని ప్రత్యర్థి లేదు. ఆఖరికి సీఎం జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా దీనికి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ నువ్వే నా నాలుగో పెళ్ళాం’ అంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

జగన్ ఇది గుర్తు పెట్టుకో

‘‘మీ జగన్ మహారాణికి చెప్పండి.. మొన్న నా దగ్గరికి కొందరు వచ్చి, సర్.. మీ నాలుగో పెళ్ళానికి కాకినాడలో అవమానం జరిగింది అన్నారు. నేను అన్నీ మర్చిపోయి అసలేంటి అని అడిగాను అప్పుడు వాళ్ళు చెప్పారు. జగన్.. నీకు నేను ఒకటే చెప్తున్నా. నేను చాలా నియంత్రణతో ఉంటా. నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా.. నువ్వు నా పెళ్ళాం అని అన్న ప్రతిసారి నువ్వు నా నాలుగో పెళ్ళాం అని అంతా మాట్లాడతారు. అది గుర్తు పెట్టుకో. ఈ విషయాన్ని వైసీపీ నేతలు కూడా గుర్తు పెట్టుకోవాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అసలు కాకినాడలో ఏం జరిగింది!

కాకినాడలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభ ఆదిత్య యూనివర్సిటీ మీదుగా వెళ్లింది. అప్పుడే యూనివర్సిటీలోని విద్యార్థులు ‘బాబులకే బాబు కల్యాణ్ బాబు’ అంటూ కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు రాష్ట్రమంతా వైరల్ అయ్యాయి. తాజాగా దీనిని ఉద్దేశించే పవన్ కల్యాణ్ మాట్లాడారు.

తన వ్యక్తిగత జీవితానికి, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని, ఈ విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తన వ్యక్తిగత జీవితాన్ని తీసుకువచ్చి ఏమి సాధించాలనుకుంటున్నారో జగన్ చెప్పాలని నిలదీశారు. తన పెళ్ళిళ్ల ప్రస్తావన జగన్ తీసుకువచ్చినప్పుడల్లా తాను ఈ నాలుగో పెళ్ళాం అనే మాటను వాడతానని పవన్ కళ్యాణ్ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

Read More
Next Story