రజకుడనే ఆర్‌ఎంపీ గిరిధర్‌ను జనసేన గూండాలు దాడి చేశారు
x

రజకుడనే ఆర్‌ఎంపీ గిరిధర్‌ను జనసేన గూండాలు దాడి చేశారు

పవన్‌ కళ్యాణ్‌ గురించి కామెంట్‌ చేసినందుకు ఆర్‌ఎంపీ వైద్యుడి పై మూకుమ్మడి దాడికి పాల్పడిన జనసేన మూకలు.


ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై కామెంట్స్‌ చేశారని ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు గిరిధర్‌ మీద అత్యంత దారుణంగా జనసేన మూకలు దాడికి పాల్పడ్డారని, రజకుడనే చిన్న చూపుతోనే గిరిధర్‌పై దాడికి పాల్పడ్డారని, అడ్డుకున్న దళితుడును కూడా చితకబాదారని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిధర్‌పై దాడి మీద శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆర్‌ఎంపీ వైద్యుడు నాలుగు రోజుల క్రితం ఓ యూట్యూబ్‌ ఛానల్‌ లో పవన్‌ కళ్యాణ్‌ పై కామెంట్‌ చేశారు. అందులో విలేఖరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు..చేసిన వ్యాఖ్యల పై గిరిధర్‌ స్పందించారు. ఆ మాత్రానికే అతనిమీద జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తారా? దాడికి పాల్పడతారా? అంటూ ప్రశ్నించారు.

వందమందికి పైగా జనసేన గూండాలు గిరిధర్‌ పై దాడి చేశారు. గిరిధర్‌ ఇల్లు, షాపులో బీభత్సం సృష్టించారు. పవన్‌ కళ్యాణ్‌ ను మిగిలిన కులాలకు చెందిన వాళ్లు కూడా విమర్శిస్తున్నారు. మరి వాళ్ల మీద మీ ప్రతాపం ఎందుకు చూపించలేకపోతున్నారు. దాడి చేయడానికి బలహీనులే మీకు కనిపిస్తారా అని పేర్ని నాని నిలదీశారు. జనసేన ముసుగులోని గూండాలను కంట్రోల్‌ చేయాలని పోలీసులను,జిల్లా ఎస్పీని కోరుతున్నాం. ఈ రౌడీలను కంట్రోల్‌ చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారు. ఇప్పటికే నమస్కారం పెట్టలేదని పోలీసులను కొట్టే స్థితికి వచ్చారు. జగన్‌ మోహన్‌ రెడ్డిని, నన్ను, నా కొడుకుని నోటికొచ్చినట్లు తిడతారు. పవన్‌ కళ్యాణ్‌ గురించి మాత్రం ఎవైనా మాట్లాడితే దాడులు చేస్తారు ఇది వాళ్ల సంస్కారం అని పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎంపీ వైద్యుడు గిరిధర్, ఆ దాడిని అడ్డుకోవడానికి వచ్చిన దళితుడు సతీష్‌ల పై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కృష్ణా జిల్లా తాళ్లపాలెం పంచాయతీలోని హెచ్‌ సత్తెనపాలెంలోని గిరిధర్‌ ఇంటి పై 100 మంది జనసేన మూకలు దాడికి పాల్పడ్డారు. గిరిధర్‌ పై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతేకాకుండా గిరిధర్‌ ఇంటిని ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఆర్‌ఎంపీ వైద్యుడి పై దాడికి పాల్పడ్డారు. దాడి తర్వాత మోకాళ్ల పై నిలబెట్టి పవన్‌ కళ్యాణ్‌ కు క్షమాపణ చెప్పించారు. నీ వెనుక ఎవరున్నారో చెప్పాలంటూ ఆర్‌ఎంపీ గిరిధర్‌ను జనసేన నాయికులు హింసించారు. జనసేన నేత కొరియర్‌ శ్రీను ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గిరిధర్‌ ఇంటిపక్కనే ఉన్న సతీష్‌ అనే దళితుడని కూడా జనసేన మూకలు చితకబాదారు. అంతటితో ఆగని ఆ మూకలు సతీష్‌ షాపును సైతం ధ్వంసం చేశారు. పోలీసుల పై కూడా జనసేన నేత కొరియర్‌ శ్రీను , జనసేన కార్యకర్తలు తిరగబడ్డారు. మీ పోలీసులను కొడితేనే కేసులు పెడతారా, మా నాయకుడిని తిడితే ఏం చేస్తున్నారంటూ పోలీసుల పై బూతులతో రెచ్చిపోయారు. ఆర్‌ఎంపీ గిరిధర్‌ పై కేసు నమోదు చేయాలని పోలీసులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో గిరిధర్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారని, జనసేన ముసుగులో మూకలు రౌడీయిజం చేస్తున్నారని, ఇక వారిని కంట్రోల్ చేయాల్సిందే అని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
Read More
Next Story