ఆర్జీవీకి జైలు శిక్ష..కూటమిలో ఆనందం
x

ఆర్జీవీకి జైలు శిక్ష..కూటమిలో ఆనందం

రామ్‌గోపాల్‌ వర్మ మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారారు. ఆయనపై కేసులు, జైలు శిక్ష తెరపైకి రావడంతో చర్చనీయాంశంగా మారారు.


ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారిన సంచలనాత్మక దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు జైలు శిక్ష పడింది. ఓ చెక్‌ బౌన్స్‌ కేసులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆర్జీవీకి జైలు శిక్ష విధించింది. మూడు నెలల పాటు జైలులో ఉండే విధంగా కోర్టు తీర్పును వెలువరించింది. అయితే రామ్‌గోపాల్‌ వర్మకు జైలు శిక్ష కాదు ఆంధ్రప్రదేశ్‌లో కాదు.. మహారాష్ట్రలో.

మహేశ్‌ చంద్ర మిశ్ర అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరు మీద రామ్‌గోపాల్‌ వర్మ మీద కోర్టును ఆశ్రయించాడు. ఓ చెక్‌ బౌన్స్‌ కేసుకు సంబంధించి 2018లో ముంబాయి అంధేరి మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. గత ఆరేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతూ ఉంది. విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపినా రామ్‌గోపాల్‌ వర్మ కోర్టుకు హాజరు కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ముంబాయి అంధేరి మెజిస్ట్రేట్‌ కోర్టు, నోటీసులు పంపినా విచారణకు హాజరు కానందుకు రామ్‌గోపాల్‌ వర్మపై సీరియస్‌ అయింది. ఈ నేపథ్యంలో ఆర్జీవీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను ఇష్యూ జారీ చేయడంతో పాటు మూడు నెలల జైలు శిక్షను విధించింది. మూడు నెలల కాలంలో ఫిర్యాదుదారునికి రూ. 3.7లక్షల చెల్లించాలని, అలా చెల్లించని పక్షంలో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తామని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. అయితే దీనిపైన రామ్‌గోపాల్‌ వర్మ ఇంత వరకు స్పందించ లేదు. దీంతో అసలు ఇది నిజమేనా? కాదా? కావాలనే ఆర్జీవీని ట్రోల్‌ చేస్తున్నారా? అనే చర్చ కూడా సోషల్‌ మీడియాలో జరుగుతోంది.
అయితే రామ్‌గోపాల్‌ వర్మకు శైలు శిక్ష పడిందనే విషయం ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి పెద్దలకు సంతోషకరమైన అంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో కాకపోయినా.. ఎక్కడో చోట రామ్‌గోపాల్‌ వర్మకు జైలు శిక్ష పడింది కదా అని ఆందనం వ్యక్తం చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్‌గోపాల్‌ వర్మను టార్గెట్‌ చేసింది. తాను రూపొందించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌ సమయంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేష్‌ల మీద అసభ్యకరమైన పోస్టులు సోషల్‌ మీడియాలో పెట్టారని ఆర్జీవీ మీద ఏపీలు పలు ప్రాంతాల్లో కేసులు నమో చేశారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఏకంగా ఆయన ఇంటికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా అందించి వచ్చారు. కానీ ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు తప్పకుండా హాజరు కావాలని తొలుత పేర్కొన్న న్యాయస్థానం తర్వాత మినహాయింపు ఇచ్చింది. అప్పటి నుంచి ఆర్జీవీని ఏ విధంగానైనా జైల్లో పెట్టించాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ముంబాయి అంధేరి మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు ఏపీ కూటమి ప్రభుత్వ పెద్దలకు కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది.
Read More
Next Story