నందిగం సురేష్‌ను జీజీహెచ్‌కు తరలించిన జైలు అధికారులు
x

నందిగం సురేష్‌ను జీజీహెచ్‌కు తరలించిన జైలు అధికారులు

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను గుంటూరు జైలు అధికారులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు శుక్రవారం తరలించారు. .


మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎడమ భుజం నొప్పి ఎక్కువగా ఉండటంతో గుంటూరు జైలు అధికారులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భుజం నొప్పితో కొంతకాలంగా బాధపడుతున్నారు. సురేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసే సమయంలోనూ భుజం నొప్పిపై పరీక్షలు చేయించి జైలుకు తరలించారు. ఇటీవ నొప్పి ఎక్కువైందని, శుక్రవారం అది మరీ ఎక్కువ కావడంతో వైద్య చికిత్సల కోసం తీసుకొచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. షుగర్, బీపీ ఎక్కువగా ఉందని, దాని వల్ల కూడా పలు రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. భుజం గూడు జారటంతో భరించలేని నొప్పితో సురేష్‌ బాధపడుతున్నారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిలో నిందితునిగా పేర్కొంటూ సురేష్‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ కేసులో బెయిల్‌ రాగానే పీటీ వారంట్‌ వేసి మరో కేసులో అరెస్ట్‌ చేసి జైలు నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ, వైెఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ఇటీవల సురేష్‌ను పరామర్శించిన జగన్ ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడా చూడలేదన్నారు.


Read More
Next Story