
మహానాడు వేళ జగన్ కీలక భేటీ
కడప ఎవరి అడ్డా, మహానాడు, టీడీపీలపైన జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.
అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు కార్యక్రమం జరుపుకుంటున్న సమయంలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కీలక భేటీ కానున్నారు. వైఎస్ జగన్‌కు, వైఎస్ కుటుంబానికి ఎప్పటి నుంచో అడ్డాగా మారిందని చెప్పుకునే కడపలో మహానాడు జరుగుతుండటం, దీనిపైన రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్ బాష వంటి వైసీపీ నాయకులు కడప ఎప్పటికీ జగన్ అడ్డానే వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో బుధవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీ నాయకులతో కీలక భేటీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మహానాడుపైన, టీడీపీపైన, కడపపైన, సీఎం చంద్రబాబుపైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అనేదిదానిపై ఆకసక్తి నెలకొంది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధుతలతో బుధవారం భేటీ కానున్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్తె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోక వర్గం పరిధిలోని గొల్లప్రోలు నగర పంచాయతీలకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులతో భేటీ కానున్నారు. వీరితో పాటు శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలానికి చెందిన స్థానిక సంస్థల నాయకులు, వైసీపీ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆయా మున్సిపాలిటీలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, వైసీపీకి కీలక నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
Next Story