పోర్టులపై జగన్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే
x

పోర్టులపై జగన్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే

తీరప్రాంతం అనేది ఎకానమిక్ గ్రోత్ ఇంజిన్ అంటూ జగన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోర్టుల అభివృద్ధి విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పొడవైన తీరప్రాంతం కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదని, పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఇంజిన్‌లా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆ మేరకు జగన్ ట్విటర్ (X) వేదికగా పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. మన రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతం కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి. తద్వారా మన రాష్ట్రాన్ని మార్చే ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిది అని పేర్కొన్నారు. తమ హయాంలో (2019-2024) కరోనా, ఆర్థిక సవాళ్లు, ప్రపంచవ్యాప్త ఆర్థిక మందగింపు వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ, 4 కొత్త పోర్టులు (రామయపట్నం, భవనాపడు, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం), 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారని, ఇది లక్షలాది ఉద్యోగాలు, వాణిజ్య, పరిశ్రమలు పెంపొందించేలా చేస్తుందని గుర్తు చేశారు. మొత్తం రూ.16,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లారని, పోర్ట్-లెడ్ డెవలప్‌మెంట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో పోర్టుల అభివృద్ధి రాష్ట్ర తీరప్రాంతాన్ని (974 కి.మీ.) ఆర్థిక హబ్‌గా మార్చేలా చేసింది. మచిలీపట్నం పోర్ట్‌కు మాజీ సీఎం 2021లో భూమి పూజ చేసి, రూ.5,500 కోట్ల పెట్టుబడితో మెగా ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. రామయపట్నం పోర్ట్‌కు 2022లో భూమి పూజ, రూ.3,740 కోట్లతో ప్రారంభం. భవనాపడు, కాకినాడ గేట్‌వే పోర్టులు కూడా వేగంగా ముందుకు సాగాయి. ఈ పోర్టులు 100 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని పెంచి, లక్షల ఉద్యోగాలు, పరిశ్రమలు తీసుకువచ్చాయని జగన్ పోస్టులో గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను విస్మరించిందని, పోర్టలు ద్వారా అభివృద్ధి అడ్డుకుంటోందని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు.వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు #YSRCPPortsRevolution హ్యాష్‌ట్యాగ్‌తో తమ పాలనలోని పోర్టుల అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారు.

Read More
Next Story