తిరుపతి లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి జగన్ లేఖ..
x

తిరుపతి లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి జగన్ లేఖ..

తిరుపతి శ్రీవారి లడ్డు వివాదంపై నిగ్గు తేల్చాలంటూ ప్రధాని మోదీకి ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు.


తిరుపతి శ్రీవారి లడ్డు వివాదంపై నిగ్గు తేల్చాలంటూ ప్రధాని మోదీకి ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. తన రాజకీయాల కోసం చంద్రబాబు.. టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఏపీ అంతా అతలాకుతలమవుతోందని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని తమపై బురదజల్లుతున్నారని, ఈ నేపథ్యంలో అసలు టీటీడీకి చేరిన నెయ్యి కల్తీలో జంతువుల కొవ్వు కలవడం అన్న అంశంపై నిగ్గు తేల్చాలని జగన్ కోరారు. ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, దీనిని రెండు పార్టీల మధ్య సమస్యగానో, ఒక రాష్ట్రంలోని సమస్యగా కూడా కాకుండా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంగా విచారణ జరిపించాలని వైఎస్ జగన్ అన్నారు.

చాలా సున్నితమైన అంశం..

‘‘టీటీడీ లడ్డూ వివాదం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇటువంటి సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు కొందరు. సీఎం హోదాలో ఉండే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ కుర్చికి ఉన్న ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారు. ఈ వ్యవహారం టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచేలా విధంగా మాట్లాడారు. టీడీపీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబకు బుద్ది చెప్పాలి. లడ్డూ వివాదంలో వాస్తవాలు తెలియజేయడం ద్వారా దేవుడిపై రాజకీయాలు చేయకూడదని ప్రపంచానికి తెలియజేయాలి. ఈ అంశం నిగ్గు తేల్చాలి’’ అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఈరోజు తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో తాను 11రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ దీక్షను తాను రాజకీయ లబ్ది కోసం చేస్తున్నానని, ప్రభుత్వాలను నిందించడానికి చేస్తున్నామని కొందరు ప్రచారాలు చేస్తున్నారని, అందులో ఎటువంటి వాస్తవాలు లేవని ఆయన తెలిపారు.

మనోభావాలు దెబ్బతినకూడదు..

‘‘నేను ఈ దీక్ష రాజకీయ లబ్ధికోసం చేయట్లేదు. స్వామివారి పూజ విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టికెట్లు అమ్ముకున్నారు. వైసీపీ పాలనలో 300 ఆలయాలు అపవిత్రం చేయబడ్డాయి. ఏ మతమైనా.. ఏ ప్రార్థనా మందిరమైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు. ప్రసాదాల్లో కల్తీ జరుగుతోంది. నాణ్యత లోపిస్తోందని ముందు నుంచే చెప్తున్నాం.. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరకున్నాం. కానీ కల్తీ ఈ స్థాయిలో జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అత్యంత పవిత్రమైన ప్రసాదంగా తిరుపతి నుంచి లక్ష లడ్డూలను అయోధ్యకు కూడా పంపారు’’ అని పవన్ తెలిపారు.

Read More
Next Story