
జగన్‌కు విజయసాయిరెడ్డి దిమ్మతిరిగే కౌంటర్
నాకు వైఎస్‌ఆర్ కుటుంబం దశాబ్దాల నుంచి తెలుసు. పెళ్లి చేసుకున్న వాళ్లే విడిపోతున్నారు. ఇక మా రాజకీయ బంధం ఎంత. అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేసి బయటకు వెళ్లి పోయిన నాటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీలుదొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు సంధించుకుంటున్నారు. విశ్వసనీయత, విలువల గురించి మాట్లాకుంటున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద, ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల మీద మాజ ఎంపీ విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. జగన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. తాను మారలేదని, ఎప్పటికీ మారను అని, మారింది జగనే అని, ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పూర్తిగా మారి పోయారని ఓ రేంజ్‌లో జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. దానిని ఇంకా కొనసాగిస్తూ.. నేను మారను, నా వ్యక్తిత్తం మారదు.. ఎప్పుడూ ఇలానే ఉంటుంది.. సీఎం పదవి వచ్చాక నువ్వే మారిపోయావు..నేను అప్పుడు ఇప్పుడూ ఇలాగే ఉన్నాను..నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్యామిలీతో గత మూడు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తున్నాను. నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగను.. ఎవరికీ భయపడను.. తప్పులు చేయను..అలాంటి వ్యక్తిత్వం నాది కాదు అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు బదులిచ్చారు.
జగన్ ఇటీవల విజయసాయిరెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమ్ముడుబోయారని విజయసాయిరెడ్డిపై రెండు రోజుల క్రితం ఆరోపణలు గుప్పించారు. వాటిని ఇంకా కొనసాగిస్తూ.. సీఎం చంద్రబాబుకు, కూటమికి మేలు చేసే విధంగా విజయసారెడ్డి రాజీనామా చేశారని విమర్శించారు. విశ్వసనీయత లేని విజయసాయిరెడ్డి వంటి వ్యక్తులు చేసే ప్రకటనలకు, మాట్లాడుతున్న మాటలకు విలువ ఏం ఉంటుందని, ఆయన చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి అంటూ ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డికి ఇంకా మూడున్నర ఏళ్లు పదవీ కాలం ఉండగానే.. కేవలం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చేందుకే తన రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ రాజీనామా చేశారని ఓ రేంజ్‌లో విజయసాయిరెడ్డి మీద జగన్ ఆరోపణలు చేశారు.
జగన్ చేసిన ఈ ఆరోపణలకు విజయసాయిరెడ్డి బదులిస్తూ.. పెళ్లి చేసుకున్న వారే విడిపోతున్నారని, ఇక రాజకీయ బంధం, ఇక మేము విడిపోవడంలో ఆశ్చర్యం ఏముందంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని, అలాంటి వ్యక్తత్వం నాది కాదంటూ జగన్ ఆరోపణలకు ధీటుగానే జవాబిచ్చారు. అంతటితో ఆగని విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించారు. మద్యం కుంభకోణం కేసుకు కర్త, కర్మా, క్రియ అంతా రాజ్ కసిరెడ్డేనని, దీని గురించి ఇంకా వివరాలు చెప్పాల్సి వస్తే చెబుతానని విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. తనకు భక్తి అనేది ఎప్పుడూ ఉందని, కాకపోతే అప్పుడు మా నాయకుడు జగన్ మీద ఉండేదని, ఇప్పుడు దేవుడి మీద మాత్రమే ఉందని అంటూ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు తన గురించి ఇంకా ఏమీ తెలియదని, తాను లొంగే రకం కాదని, ఎన్నో సమస్యలు, బాధలు ఎదుర్కొన్నానని, అవమానలు పడ్డానని, అక్కడ ఉంటే అవి తగ్గే పరిస్థితులు కనిపించ లేదని, ఆ విషయం అర్థమైందని,అందువల్లే తప్పుకున్నానని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Next Story