భేటీ తర్వాత బెంగుళూరుకు జగన్‌
x

భేటీ తర్వాత బెంగుళూరుకు జగన్‌

రాజంపేట, రామకుప్పం, మడకశిర, పెనుగొండ స్థానిక సంస్థల నేతలతో జగన్‌ భేటీ కానున్నారు.


మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం బెంగుళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. వైసీపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ గత కొద్ది రోజులుగా బిజీ అయిన జగన్‌ గురువారం సాయంత్రం బెంగుళూరుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం వైసీపీ స్థానిక సంస్థల నేతలతో భేటీ కానున్నారు. అన్నమయ్య జల్లా రాజంపేట మునిసిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మునిసిపాలిటీ, పెనుగొండ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని రొడ్డం మండలానికి చందిన ఎంపీపీలు, వైఎస్‌ ఎంపీపీలు, మునిసిపల్‌ చైర్మన్లు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నాయకులతో జగన్‌ సమావేశం కానున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పలు మునిసిపాలిటీలలో, మునిసిపల్‌ కార్పొరేషన్‌లలో చోటు చేసుకున్న పరిణామాలు, అవిశ్వాస తీర్మానాలు వంటి పలు అంశాలపై జగన్‌ చర్చించనున్నారు. నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై భవిష్యత్‌ కార్యాచరణ గురించి కూడా జగన్‌ దిశా నిర్థేశం చేయనున్నారు.
ఈ భేటీ కార్యక్రమం అయిన తర్వాత సతీసమేతంగా జగన్‌ బెంగుళూరుకు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్‌ బయలుదేరి గన్నవరం ఎయిర్‌ పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరుకు వెళ్లనున్నారు.
Read More
Next Story