
జగన్ మామా, ఒక్క సెల్ఫీ మామా!
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పదవి లేకపోయినా జనంలో ప్రత్యేకించి తన సొంత ఇలాకాలో ఏమాత్రం క్రేజ్ తగ్గినట్టు లేదు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పదవి లేకపోయినా జనంలో ప్రత్యేకించి తన సొంత ఇలాకాలో ఏమాత్రం క్రేజ్ తగ్గినట్టు లేదు. ప్రత్యేకించి తన సొంత జిల్లా కడప పర్యటనలో ఆయనకు అడుగడుగునా స్వాగతసత్కారాలే లభించాయి. ఫిబ్రవరి 13న తాడేపల్లి నుంచి కడపకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డితో సెల్ఫీల కోసం వందలాది మంది యువకులు పోటీ పడ్డారు. ఓ దశలో ఆయన్ను సెక్యూరిటీ సిబ్బంది పక్కకు తీసుకువెళ్లి ఓ వేదిక మీద నిలబెట్టాల్సి వచ్చింది.
2017లో ఏపీ వ్యాప్తంగా సాగించిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఈ సెల్ఫీలతో బాగా ఫేమస్ అయింది. వైసీపీ కార్యకర్తలతో పాటు లక్షలాది మంది ఆయన అభిమానులు పోటీ పడి మరీ సెల్ఫీలు దిగారు. ఇడుపుల పాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న ముగిసింది. ఈయాత్ర సాగిన 3 వేల 6 వందల 48 కిలోమీటర్ల మేర సెల్ఫీల జాతర నడిచింది.
ఇప్పుడు మళ్లీ కడపలో అదే సీన్ కనబడింది. మేడా రఘునాధ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైనపుడు వందలాది మంది యువతీ యువకులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. "జగన్ మామా, సెల్ఫీ మామా!' అంటూ యువకులు నినాదాలు చేశారు. చేతుల్లో సెల్ ఫోన్లు పట్టుకుని కేరింతలు కొట్టారు. సాధ్యమైనంత మందికి సెల్ఫీల కోసం అవకాశం ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి నూతన వధూవరులు లక్ష్మీ మౌనిక, సుధీర్ కుమార్ రెడ్డిలను ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రముఖులతో, పార్టీ నాయకులతో ముచ్చటించారు.
ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ లో గడిపారు. మధ్యాహ్నం తర్వాత జగన్ కడప నుంచి బెంగళూరు బయలుదేరారు.
Next Story