‘రక్షణ లేదు’.. గవర్నర్ జోక్యం కోరిన జగన్..
x

‘రక్షణ లేదు’.. గవర్నర్ జోక్యం కోరిన జగన్..

రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు మాటకైనా కనిపించడం లేదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు మాటకైనా కనిపించడం లేదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కత్తులు, రాడ్లు, కర్రలు తీసుకుని బహిరంగంగా నడి రోడ్లపైనే దాడులు చేస్తున్న ఘటనలు అనేకం జరిగాయని, వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలో ఈ హింసాత్మక ఘటనలను అడ్డుకోవడానికి గవర్నర్ జోక్యం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులను నివారించడానికి గవర్నర్ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

‘‘రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకుముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడిక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. ఈ అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్సణగా నిలవాలని గవర్నర్ కోరుతున్నాం’’ అని ఆయన ట్వీట్ చేశారు.

Read More
Next Story