న్యాయం కోసం 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా– కానీ..
x

న్యాయం కోసం 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా– కానీ..

తాము నిర్దోషి అని నమ్ముతున్న సత్యంబాబుపై మళ్లీ కేసు పెట్టి తమ అభిప్రాయం చెప్పమంటే ఎలా అని షంషాద్‌ బేగం ప్రశ్నించారు.


న్యాయం కోసం గత 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని, అయినా విచారణలో తీవ్ర జాప్యం జరుగుతూనే ఉందని ఆయేషా మీరా తల్లి షంషాద్‌ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శనివారం తెనాలిలో మాట్లాడుతూ ఈ కేసులో సత్యంబాబు అనే వ్యక్తి నిర్దోషి అని తాము నమ్ముతున్నట్లు వెల్లడించారు. అయితే నిర్దోషి అని తాము నమ్ముతున్న అదే సత్యంబాబుపై మళ్లీ కేసు పెట్టి మళ్లీ తమను అభిప్రాయం అడగటం ఏంటని షంషాద్‌ బేగం ప్రశ్నించారు. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో విచారణకు రావాలని నోటీసులు అందినట్లు వెల్లడించారు. కేసు విచారణ ముగిసిందని జూన్‌లోనే సీబీఐ తన రిపోర్టును సీల్డ్‌ కవర్‌లో పెట్టి హైకోర్టుకు సమర్పించింది, అయితే ఆ రిపోర్టు కాపీలను తమకు ఇవ్వకుండా కేసు గురించి అభిప్రాయాలు చెప్పాలంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు.

నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుందనే పేరు కలిగిన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ సీబీఐ కూడా తమ బిడ్డ ఆయేషా మీరాకు న్యాయం చేయలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పవిత్రమైన మత సంప్రదాయాలను పక్కన పెట్టి ఆయేషా మీరా రీ పోస్టుమార్టానికి తాము సహకరించామని, ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందిని, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, హోం మంత్రి అనిత, డీజీపీలు కూడా దీనిపై స్పందించాలని షంషాద్‌ బేగం కోరారు.

ఆయేషా మీరా కేసు అప్పట్లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. 2007 డిసెంబరు 27 రాత్రి విజయవాడకు సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని ఓ మహిళల వసతి గృహంలో ఆయేషా మీరా హత్యకు గురయ్యారు. అయితే ఈ కేసులో సత్యంబాబు అనే వ్యక్తని 2008లో పోలసులు అరెస్టు చేశారు. సత్యంబాబుకు విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు విధించిన జీవిత ఖైదు కేసును 2017 మార్చి 31న ఏపీ హైకోర్టు ఈ కేసును కొట్టివేయడంతో పాటుగా సత్యంబాబును నిర్దోషి అని తీర్పును వెలువరించింది. అయితే దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. 2018లో సీబీఐ ఈ కేసు బాధ్యతలు తీసుకుంది. మూడు నెలల క్రితం సీల్డ్‌ కవర్‌ రిపోర్టును హైకోర్టుకు సమర్పించింది. అయితే సీబీఐ రిపోర్టును తమకు కూడా ఇవ్వాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ విషయాన్ని దిగువ కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. ఆ మేరకు ఆయేషా మీరా తల్లిదండ్రులు విజయవాడ సీబీఐ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసుకున్నా ఇంత వరకు హైకోర్టుకు సమర్పించిన రిపోర్టు కాపీని ఇంత వరకు సీబీఐ ఆయేషా మీరా తల్లిదండ్రులకు అందించ లేదు. ఈ క్రమంలో ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని విజయవాడ సీబీఐ కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.
Read More
Next Story