
ఎప్పుడూ ఓడేది ప్రజలే! మీరేమంటారు?
వాళ్లు మాత్రం పెద్ద కేటుగాళ్లు, ప్రజలే పెద్దఓటు గాళ్లంటూ మేడిపండు సామెతను గుర్తుచేస్తున్న ప్రజాస్వామ్యంపై ప్రముఖ కవి తమ్మినేని అక్కిరాజు ఆవేదన ఇది.
నోటుకు ఓటు, ఓటుకు నోటు, వాళ్లు మాత్రం పెద్ద కేటుగాళ్లు, ప్రజలే పెద్దఓటు గాళ్లంటూ మేడిపండు సామెతను గుర్తుచేస్తున్న ప్రజాస్వామ్యంపై ప్రముఖ కవి తమ్మినేని అక్కిరాజు ఆవేదన ఇది.
(తమ్మినేని అక్కిరాజు)
- ఒకసారి 'వాడు'
 
ఒకసారి 'వీడు'
ఇద్దరూ గెలుస్తారు!
ఎప్పుడూ ఓడేది 
ఈ దేశ ప్రజలు!
స్వతంత్రం వచ్చి 
76 ఏళ్ళు ఐంది!
వాడుకాని వీడుకాని 
వీళ్ళ దృష్టిలో 
ప్రజలు'ఓటు'గాళ్ళు!
వాడువీడూమాత్రం 
పెద్ద 'కేటు' గాళ్ళు!
'నోటు' గాళ్ళు 
'సీటు' గాళ్ళు 
పెద్ద 'ఛీట్' గాళ్ళు!
ప్రజాస్వామ్య 'వేటు'
'వేట' గాళ్ళు!
రాజకీయాల్లో 
'మోటు' గాళ్ళు!
'నాటు' గాళ్ళు!
వీళ్ళకు తోడు 
'మఠం' గాళ్ళు 
'పీఠం' గాళ్ళు 
రాజకీయం+మతం 
ఝాటా గాళ్ళు!
'వాడు' కాని 
'వీడు' కాని 
జనం అజ్ఞానం నుంచి 
బైట పడకుండా 
జాగ్రత్త పడేవాళ్ళు !
ఎన్నికల'ఆట'గాళ్ళు 
జనాన్ని'ఆడి'స్తారు!
'ఓట్లు' కోసం 
మందుపోసి 
'పాటపాడి'స్తారు!
అంతకుముందే 
కులమతాల మందు 
పొసే ఉన్నారు!
వాటితో వీళ్ళను 
బాగా వేడెక్కిస్తారు! 
ఇలాంటి నాయకుల 
మధ్య ఉండలేక 
చదువుకున్నవాళ్లు 
అమెరికావెళితే 
వాడు'ఝాడి'స్తాడు!
సంకెళ్లు వేసి 
సైనిక విమానంలో 
క్రిమినల్స్ కంటే 
ఘోరంగా కట్టి 
ఇక్కడ పడేస్తాడు!
విశ్వం ముందు 
మనపరువు 
విశ్వ గురువు 
తీసే స్తాడు!
మౌనం పాటిస్తాడు!
పాలక పక్షం 
ప్రతి పక్షం 
వాడైనా వీడైనా 
ఇద్దరూ కుడా 
ఒకేతాను ముక్కలు!
ఎంతసేపూ
వాళ్ళ లాభాలు 
వాళ్ళ స్వార్ధం 
ఈ స్థితి లో 
మనం ఏంచేద్దాం?
కులమాతాలతో 
తన్నుకుందాం!
మనకుతెలిసిన 
విద్య అదొక్కటే 
ఏమంటారు?
అంతకీ కాకపొతే 
గుళ్ళచుట్టుతిరిగి 
రాంభజన చేద్దాం!
దిక్కులేనివాళ్లకు 
దేవుడేకదా దిక్కు!
Next Story

