
కాకినాడ సెజ్‌కు భూములిచ్చేలా చేసింది యనమలే
తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. లేఖ రాయడం కాదని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడిపై మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాకినాడ సెజ్‌కు రైతులు తమ భూములు ఇచ్చే విధంగా చేసింది యనమలేనని మండిపడ్డారు.
నాడు మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు రైతుల పక్షాన ఎందుకు నిలబడ లేదని నిలదీశారు. కాకినాడ సెజ్ భూములపై నిజంగానే యనమలకు చిత్త శుద్ధి ఉంటే భూ దోపిడీపై సీఎం చంద్రబాబుతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన కాకినాడలో మాట్లాడుతూ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్ భూములపై తీర్మానం చేశారన్నారు. కేవలం తన రాజకీయాల ప్రయోజనాలు, తన స్వలాభం కోసమే యనమల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని ఎద్దేవా చేశారు. 2002–03లో కాకినాడ సెజ్ కోసం భూ సేకరణ ప్రారంభమైందని, అప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారని, 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సెజ్ భూములపై తీర్మానం జరిగిందని, నాడు కూడా ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల ఎందుకు కాకినాడ సెజ్ రైతుల పక్షాన నిలబడలేదని నిలదీశారు. సెజ్‌కు ముందుగా భూములిచ్చింది యనమలేనని, తానే ముందుకుగా భూములిచ్చి తక్కిన రైతులంతా భూములిచ్చే విధంగా మోటివేట్ చేసింది యనమలేనని ధ్వజమెత్తారు. సెజ్ రైతులపై యనమలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం చంద్రబాబుతో విచారణ జరపించాలన్నారు. వేల కోట్లు దోచుకున్న కేవీరావు చౌదరి నుంచి సొమ్మును తిరిగి వెనక్కి తీసుకొని రైతులకు ఎకరాకు రూ. 40లక్షలు చెల్లించాలని అన్నారు. సెజ్ భూములను జగన్ తిరిగి రైతులకు ఇచ్చిన విధంగానే చంద్రబాబు కూడా తిరిగి రైతులకు భూములు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అలా చేపట్టేందుకు సీఎం చంద్రబాబుకు మంచి మనసు ప్రసాదించాలని దేవుడిని కోరుతున్నట్లు చెప్పారు.
Next Story