“కర్నూలు ఉత్సవ్ – 2025 పేరుతో ఉమ్మడి కర్నూలు జిల్లా చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాన్ని టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించడం మేము స్వాగతిస్తున్నాం. అయితే, ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని ప్రకటించడం ఆశ్చర్యకరమూ, బాధాకరమూ” అని పేర్కొన్నారు.
రాయలసీమ హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నేత టీజీ వెంకటేష్ గారు నవంబర్ 1న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం బాధాకరమని ఆయన అన్నారు. “తెలుగు రాష్ట్రం అక్టోబర్ 1, 1953న ఏర్పడింది. శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో రాయలసీమ నాయకత్వం కోస్తా నాయకత్వంతో భుజం భుజం కలిపి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాడింది. ఆ ఉద్యమానికి కొనసాగింపుగానే శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం ద్వారా ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1న ఆవిర్భవించింది” అని బొజ్జా గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా నిలిచిందని, ఆంధ్ర రాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు కర్నూలులోని కె.వి.ఆర్. కళాశాల సమావేశ మందిరంలో ప్రమాణస్వీకారం చేసిన చారిత్రక అంశాన్ని ఆయన గుర్తుచేశారు. తరువాత నవంబర్ 1, 1956న తెలంగాణ విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, తరువాత జూన్ 2, 2014న తెలంగాణ తిరిగి విడిపోయి ఏర్పడిందని వివరించారు.
“చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా, సాంకేతికంగా తెలుగు రాష్ట్ర అవతరణ అక్టోబర్ 1ననే జరిగింది. ఈ నిజాన్ని విస్మరించి నవంబర్ 1న కార్యక్రమం నిర్వహించడం చరిత్రను వక్రీకరించే చర్య” అని బొజ్జా దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ హక్కుల కోసం పోరాడిన నాయకులు, చారిత్రాత్మక, సాహిత్య రంగాలలో ప్రముఖులైన వ్యక్తులు నవంబర్ 1న టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనడం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు. “ఇది శ్రీబాగ్ ఒడంబడిక వంటి చారిత్రక పత్రాలను ప్రజల మనసుల నుండి తొలగించే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తోంది” అని బొజ్జా పేర్కొన్నారు. ప్పటికైనా చారిత్రక సత్యాన్ని గౌరవిస్తూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1ననే నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.ఎన్.రెడ్డి, ఏర్వ రామచంద్రరెడ్డి, కార్యదర్శి మహేశ్వరరెడ్డి, కోశాధికారి చెరుకూరి వెంకటేశ్వరనాయుడు, సభ్యులు కొమ్మా శ్రీహరి, భాస్కర్‌రెడ్డి, రాముడు, అసదుల్లా మియా, మహబూబ్ బాష, గురజాల మద్దిలేటి తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.