Revanth Davos target|దావోస్ లో రేవంత్ టార్గెట్ ఇదేనా ?
x

Revanth Davos target|దావోస్ లో రేవంత్ టార్గెట్ ఇదేనా ?

ఫోర్త్ సిటీ(Fourth city)ని ప్రమోట్ చేయటమే టార్గెట్ గా దావోస్ వేదికను రేవంత్ ఉపయోగించుకోబోతున్నాడు.


అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణకు వేదికైన దావోస్ కు రేవంత్ ఏకైక టార్గెట్ తో వెళుతున్నాడు. మామూలుగా విదేశాల్లో లేదా దావోస్(Davos) పర్యటనలో పాల్గొనే మన ముఖ్యమంత్రులందరు రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించటమే ధ్యేయమని చిలకపలుకులు పలుకుతుంటారు. ఈ విషయం గతంలో చాలాసార్లు రుజువైంది. అయితే రేవంత్(Revanth) మాత్రం ఈసారి ప్రత్యేక టార్గెట్ పెట్టుకుని మరీ వెళుతున్నాడు. ఇంతకీ ఆ టార్గెట్ ఏమిటంటే ఫోర్త్ సిటీని ప్రమోట్ చేయటమే. ఫోర్త్ సిటీ(Fourth city)ని ప్రమోట్ చేయటమే టార్గెట్ గా దావోస్ వేదికను రేవంత్ ఉపయోగించుకోబోతున్నాడు. పోయిన ఏడాది దావోస్ పర్యటనలో 14 కంపెనీలతో సుమారు 42వేల కోట్లరూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే.

అప్పట్లో 14 కంపెనీలతో చేసుకున్న 18 ప్రాజెక్టుల్లో 17 ప్రాజెక్టులు గ్రౌండయ్యీయి. ఈ విషయంలో రేవంత్ విజయంసాధించాడనే చెప్పాలి. వీటిల్లో 17 ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభమై వివిధదశల్లో పనులు జరుగుతున్నాయి. మామూలుగా ఏ కంపెనీ అయినా ప్రభుత్వంతో అనేక ఒప్పందాలు చేసుకుంటుంది. దాంతో ప్రభుత్వంతో సదరు కంపెనీ వేలాది కోట్లరూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నట్లు అధినేతలు ప్రకటించటం చాలాసహజం. అయితే పెట్టుబడలకు చేసుకున్న ఒప్పందాల్లో చివరకు పదిశాతం వాస్తవంలోకి వస్తే చాలాగొప్ప. ఒప్పందాలు లక్షలకోట్లరూపాయల్లో ఉన్నా గ్రౌండ్ రియాలిటీ వేలకోట్లరూపాయల్లో కూడా ఉండకపోవచ్చు. అయితే పోయినఏడాది రేవంత్ దావోస్ పర్యటన మాత్రం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

మామిడిపల్లి హార్డ్ వేర్ ప్కార్కులో అదాని(Adani) మిస్సైల్ షెల్ మాన్యుఫాక్షరింగ్ యూనిట్ ఈనెలాఖరుకు అందుబాటులోకి రాబోతోంది. కౌంటర్ ద్రోన్ సిస్టమ్స్ మాన్యుఫ్యాక్షరింగ్ యూనిట్ కూడా ఏడాది చివరలో ఉత్పత్తి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. రామన్నపేటలో అదానీ కంపెనీ 6 మిలియన్ టన్నుల సిమెంట్ గ్రైడింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు జరుగతున్నాయి. వెబ్ వర్క్స్ కంపెనీ 10 మెగావాట్ల సామర్ధ్యంతో డేటాసెంటర్ ఏర్పాటు పనులను స్పీడుగా చేస్తోంది. గోద్రెజ్ ఆధ్వర్యంలో ఇండియాలోనే మొట్టమొదటి ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ నిర్మాణం ఖమ్మంలో మొదలైంది. బీఎల్ ఆగ్రో ఆయిల్ రీఫైనరీ కమ్ ప్రాసెసింగ్ యూనిట్ ను తొందరలోనే ప్రారంభించబోతోంది. ఇవేకాకుండా మరో 12 ప్రాజెక్టుల గ్రౌండింగ్ వివిధ దశల్లో ఉన్నాయి.

అందుకనే ఈసారి దావోస్ పర్యటనలో కూడా రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించటంతో పాటు ప్రత్యేకంగా ఫోర్త్ సిటీలో పెట్టుబడులను ఆకర్షించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. ఫోర్త్ సిటీని ఏ విధంగా ప్రమోట్ చేయాలనే విషయమై రేవంత్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఫోర్త్ సిటీ అన్నది రేవంత్ కలల ప్రాజెక్టుగా మారిపోయింది. ఈ ప్రాజెక్టును గనుక రేవంత్ సాకారంచేయగలిగితే తనకీర్తి చిరస్ధాయిగా మిగిలిపోవటం ఖాయం. లేకపోతే మిగిలిన సీఎంల్లాగే రేవంత్ కూడా ఒట్టి మాటలమనిషిగా మిగిలిపోతారంతే.

రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల ప్రాంతంలో ఫోర్త్ సిటీని ఏర్పాటుచేయాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు. సుమారు 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ(ఫ్యూచర్ సిటీ)ని నిర్మించాలన్నది రేవంత్ కల. అందుకనే ముచ్చర్లలో ప్రభుత్వ స్ధలాలతో పాటు రైతులనుండి కూడా పెద్దఎత్తున భూములను సేకరిస్తున్నారు. అలాగే అటవీభూములుంటే వాటిని కూడా సేకరించాలని అధికారులను రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. ఫోర్త్ సిటీని సక్సెస్ చేయటంకోసమే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Samshabad Airport) రోడ్డు కమ్ మెట్రోట్రైన్ కనెక్టివీటిని ఏర్పాటుచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్(Microsoft), గుగుల్(Google), ఫాక్స్ కాన్(Foxconn) లాంటి అతర్జాతీయ ప్రఖ్యాత కంపెనీలను ఫోర్త్ సిటీలోనే ఏర్పాటుచేయించాలని రేవంత్ చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఫోర్త్ సిటీ ప్రతిపాదిత ప్రాంతంలోనే రేవంత్ శంకుస్ధాపన చేసి నిర్మాణ పనులను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

పెట్టుబడుల ఆకర్షణే టార్గెట్ గా రేవంత్ తన బృందంతో ఈనెల 16-19 మధ్యలో సింగపూర్లో పర్యటించబోతున్నారు. అలాగే అక్కడినుండే దావోస్ కు వెళతారు. 20-22 మధ్య దావోస్ లో జరగబోయే సదస్సులో వివిధ కంపెనీల సీఈవోలతో భేటీకి ఏర్పాట్లు కూడా జరిగాయి. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ కంసెనీలు ముందుకొచ్చి ఒప్పందాలన్నీ వాస్తవంలోకివస్తే రేవంత్ టార్గెట్ రీచవటంలో నూరుశాతం సక్సెస్ సాధించాడనే అనుకోవాలి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story