గవర్నర్ తో చంద్రబాబు భేటీలో ఆంతర్యం?
x
గవర్నర్ నజీర్ కు పుష్పగుచ్చం ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

గవర్నర్ తో చంద్రబాబు భేటీలో ఆంతర్యం?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు.


రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కేసుల పరంపర కొనసాగుతున్నది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రదాన మంత్రి మోదీ, అమిత్ షా, నడ్డాలను కలవనున్నారు. ఇప్పటికే ఆయన టూర్ ఖరారైంది. వైఎస్సార్సీపీ ఆగడాలు పెరిగాయని, అరికట్టేందుకు ఏ విధంగా వ్యవహరించాలో మీరే సూచించాలంటూ కేంద్ర పెద్దలను చంద్రబాబు కోరే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వంలో అమరావతి రాజధాని ప్రాంతంలో అనే పనులు మొదలు పెట్టారు. ఈ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మంత్రి నారాయణ నేతృత్వంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే, మంత్రులు, హెచ్వోడీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. అలాగే ఏపీ సచివాలయం నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణ పనులు కూడా ప్రభుత్వం మొదలు పెట్టింది.

రెండో సారి అమరావతి శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రధాన మంత్రి మోదీ హాజరయ్యారు. దీనికి ప్రభుత్వం అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి వచ్చారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పటి వరకు అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 14వేల కోట్లు మంజూరైనట్లు ప్రకటించారు. ఇటు అమరావతిలో పనులు వేగంగా ముందుకు సాగటం, పోలవరం పనులు పూర్తి కావడం, పోలవరం-బనకచర్ల పనులకు కావాల్సిన అనుమతులు కావాలని కోరేందుకు ముఖ్యమంత్రి వెళుతున్నారనేది స్పష్టం. ఈ పేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ ను ముఖ్యమంత్రి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అభివృద్ధి పనులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి గవర్నర్ నుకలిసారని పలువురు చెబుతున్నా, దీని వెనుక ఎన్నో రాజకీయ కారణాలు ఉన్నాయని స్పష్టమవుతుతోంది. ప్రాజెక్టుల కింద పునరావాస బాధితులకు పైసా కూడా ఇంత వరకు ఇవ్వలేదు. మూడు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి కావాల్సిన నిధుల గురించి కూడా చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంత మొత్తం నిధులు కావాలో... ఆ నిధులు సాధించుకునేందుకు కేంద్రాన్ని ఏమని కోరాలో కూడా ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయించుకున్నారు. గవర్నర్ ద్వారా రాష్ట్ర పరిస్థితులు తెలుసుకునేలా చేయాలనే ఆలోచనలోనే ముఖ్యమంత్రి గవర్నర్ తో భేటీ అయ్యారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Read More
Next Story