మ్యానిఫెస్టో అంటే ప్రశ్నించడమేనా?
x

మ్యానిఫెస్టో అంటే ప్రశ్నించడమేనా?

సీపీఎం ఎన్నికల ప్రణాళిక ఇటీవల విడుదల చేసింది. అన్ని పార్టీలవి ఒక స్టైలైతే.. సీపీఎంది మరో స్టైల్‌. అదే ప్రశ్నించే స్టైల్‌.. ఇదేంటనుకుంటున్నారా..


జి.విజయ కుమార్

సీపీఎం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మ్యానిఫెస్టోను ఇటీవల విడుదల చేఇసింది. ఆరుగు నాయకులు ఈ మ్యానిఫెస్టోను విడుదల చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వీరంతా మీడియా సమవేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బీజీపీతో అంటకాగుతోన్న టీడీపీ, జనసేన కూటమి, వైఎస్‌ఆర్‌సీపీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనేది వారి మ్యానిఫెస్టో ప్రధాన సారాంశం. ఈ మూడు పార్టీలకు 14 ప్రశ్నలు సంధించారు. ఇవే కాకుండా మరి కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం విశేషం. ఎక్కడా కూడా తమ పార్టీని పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే మేము ప్రజల కోసం ఈ హామీ ఇస్తున్నాం అనేది ఒక్కటి కూడా లేక పోవడం గమనార్హం.
ప్రశ్నించడమే ఓట్లడగటమా..
ఏ రాజకీయ పార్టీ అయిన అధికారంలోకి వస్తే తాము చేయదలచుకున్న పనులను హామీల రూపంలో ఇస్తారు. అధికారం చేపట్టిన తర్వాత తూచా తప్పకుండా ఆ హామీలను నెరవేరిస్తే ప్రజలు కూడా ఆ పార్టీకి బ్రహ్మరథం పడుతారు. అయితే సీపీఎం వాళ్లు లేవనెత్తిన ప్రశ్నలు ద్వారా ఓట్లను ఓట్లు అడుగుతున్నారా.. ఇతర పార్టీలను ప్రశ్నిస్తున్నారా? ఎన్నికల్లో పోటీ చేసేది ఓట్ల కోసమా.. ప్రశ్నించడం కోసమా? ఉదాహరణకు సీపీఎం వాళ్లు వేసిన ఒక ప్రశ్నను చూద్దాం. ఇది అందరికీ సులువుగానే అర్థమయ్యే ప్రశ్నే. ఎన్నికల బాండ్ల రద్దును సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? ఇది వారి మ్యానిఫెస్టోలో ఒక అంశం. ఈ అంశం ద్వారా ఓటర్లకు ఏమి చెప్పదలచుకున్నారు. ఓటు వేయమంటున్నారా లేదా వద్దంటున్నారా అనేది స్పష్టత లేదు. ఇంకో ప్రశ్న కూడా విచిత్రంగా ఉంది. కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను బిజెపీ ఎత్తి వేసింది. మిగిలిన పార్టీలు దానిని పునరుద్దరిస్తాయా? లేదా సమర్థిస్తాయా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ప్రశ్నే. ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తున్నారు. ఓటర్లుకు ఇతర రాజకీయ పార్టీలకు ప్రశ్నలు వేస్తున్నారు. ఇదేమీ హామీల జడో.. ఎవరికీ అర్థం కానీ ప్రశ్న. ఇంతకూ వారికైనా ఎన్నికల్లో ఓటర్లలో ఏమి అడగాలో స్పష్టత ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రశ్నించడం మా పంథా.. సమాధానం చెబుతారో చెప్పరో మీ ఇష్టం. ఓటర్లు ఏమి ఆలోచించుకుంటారో వారి ఇష్టం. సీపీఎం ఎన్నికల మ్యానిఫెస్టో మాత్రం భలే గమ్మత్తుగా ఉంది. ఇలాంటి మ్యానిఫెస్టోను ఇంతముకు ముందెప్పుడు ఏ ఎన్నికల్లోను చూడ లేదని రాజకీయ పరిశీలలు అభిప్రాయపడుతున్నారు.
కూటమిలో ఎవరి దారి వారిదే..
నిజానికీ సీపీఎం ఇండియా కూటమిలో ఉంది. ఇండియా కూటమీ ఉమ్మడి మ్యానిఫెస్టోను రిలీజ్‌ చేసిన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌ ప్రత్యేకంగానే ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. ఏ పార్టీకి ఆ పార్టీ తమ మ్యానిఫెస్టోలను ప్రకటిస్తూ వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు వేరుగా ప్రకటిస్తున్నాయంటే దానికి అ«ర్థం ఉంది. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలు కూటమిగా ఉన్నప్పుడు ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటించి ఉంటే బాగుండేదని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించడం విశేషం.
సీపీఎంకు రాజకీయానుభవం లేదా?
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో భారత కమ్యునిస్టులుగా ఏకమై పోరాడిన చరిత్ర వారిది. ఉమ్మడి కమ్యునిస్టులుగాన 1952 నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పార్లమెంట్, అసెంబ్లీల్లో గళమెత్తిన చరిత్ర వారికి ఉంది. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష పార్టీ అంటే పార్లమెంట్‌లో నాడు కనిపించింది కమ్యునిస్టులే. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో నాడు కాంగ్రెస్‌కు ప్రత్యర్థులుగా కమ్యునిస్టులు మాత్రమే ఉన్నారు. ప్రజల అజెండా ఎలా ఉండాలో.. ప్రజలకు ఏమి కావాలో వారికి తెలియంది కాదు. నేటి కమ్యునిస్టుల అజెండాలో ఈ విధమైన మ్యానిఫెస్టో రూపొందుతుందని, అది ఇతర పార్టీలను ప్రశ్నించడానికి తప్ప వీరు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి పనికి రాదని తెలియక పోవడం ఒక విశేషంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
Read More
Next Story