
‘బిగ్ త్రీ’ అజ్ఞాతం..వ్యూహాత్మక విరామమా?
గతేడాది డిసెంబరు ఆఖరు నుంచి బాబు, పవన్, లోకేష్ కనిపించక పోవడంతో వీరి పర్యటనలపై మిస్టరీ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ యంత్రాంగం ఒక్కసారిగా ‘నిశ్శబ్ద మోడ్’లోకి వెళ్లిపోయింది. రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచే ముగ్గురు కీలక నేతలు—ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్—గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నూతన సంవత్సర వేళ ప్రజల మధ్య గడపాల్సిన ఈ 'బిగ్ త్రీ', 2026 జనవరి 1న కూడా ఏపీలో లేకపోవడం, వారి పర్యటనల వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించకపోవడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. పాలన పగ్గాలు ఎవరి చేతుల్లో ఉన్నాయంటూ విపక్షాలు ప్రశ్నిస్తుండగా, ఇది వ్యక్తిగత పర్యటనలా లేక రాబోయే ఎన్నికల వ్యూహరచనలో భాగమా అన్న సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఎక్కడికి వెళ్లారు? - గోప్యత వెనుక మర్మం ఏంటి
నిత్యం ఇబ్బడి ముబ్బడిగా సమావేశాలు, రివ్యూలు, పర్యటనలు చేపడుతూ వారి సోషల్ మీడియాలలో ఆ ఫొటోలతో హోరెత్తించే ఈ ముగ్గురు కీలక నేతలు గత నాలుగు, ఐదు రోజులుగా సచివాలయంలోనూ, బహిరంగ కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో ఉన్నారని ఒక వర్గం చెబుతుండగా, మరికొందరు మాత్రం ఆయన ఢిల్లీలో కీలక చర్చల్లో ఉన్నారని భావిస్తున్నారు. 2025 డిసెంబరు 30న రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకు సీఎం చంద్రబాబు మాత్రం అదే రోజు హైదరబాద్ శంసాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బాలి వెళ్లారనే చర్చ కూడా వినిపిస్తోంది. అయితే కొంత మంది కూటమి వర్గాలు మాత్రం లండన్ వెళ్లారని, ఢిల్లీ వెళ్లారని చర్చించుకుంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా ఇదే రకంగా వెళ్లారనే టాక్ కూడా వినిపిస్తోంది. వ్యక్తిగత పర్యటన కోసం రష్యా లేదా సింగపూర్ వెళ్లినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయవాడ బుక్ ఫెస్టివల్ ను వీరిద్దరు కలిసి ప్రారంభిస్తారని అందరూ భావించారు.
కీలక మంత్రి నారా లోకేష్ కూడా విదేశీ పర్యటనల బాట పట్టారనే చర్చ కూడా ఉంది. పెట్టుబడుల సేకరణ పేరిట ఆయన అమెరికా వెళ్లినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా, అధికారిక షెడ్యూల్ విడుదల కాలేదు. కూటమిలో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న కీలక మంత్రి నారా లోకేష్ కూడా ఇదే రకంగా రహస్య టూర్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 2025 డిసెంబరు 28న జరిగిన ఆ ఏడాది ఆఖరి మంత్రి వర్గ సమావేశాన్ని కూడా డుమ్మా కొట్టి అదే రోజు హైదరబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కేథ్ వే పసిఫిక్ ఎయిర్‌ౖలñ న్స్‌లో హాంకాంగ్ వెళ్లారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. కూటమి వర్గాలు మాత్రం నారా లోకేష్ అమెరికా వెళ్లారని, ఢిల్లీ వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.
విపక్షాల విమర్శలు: ‘అనాథగా ఏపీ?’
ముఖ్య నేతల గైర్హాజరీపై వైఎస్సార్‌సీపీ ఎదురుదాడికి దిగింది. పారదర్శకత ఎక్కడ?: రాష్ట్రంలో కీలక సమస్యలు (ఉదాహరణకు హాస్టళ్ల దుస్థితిపై కోర్టు మొట్టికాయలు, శాంతిభద్రతల సమస్యలు) ఉన్నప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎక్కడికి వెళ్లారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. వారి ముగ్గిరి టూర్ ల గురించి గోప్యతపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పర్యటనలను ఎందుకు ఇంత రహస్యంగా ఉంచుతున్నారు? ఇది విహార యాత్రనా లేక రాజకీయ యాత్రనా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ పాలనలో నిశ్శబ్దం
నిత్యం ఏదో ఒక హడావుడి చేస్తూ ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటున్న ఈ ముగ్గురు నాయకులు ఒక్క సారిగా కనిపించక పోవడంతో రాజకీయ విశ్లేషకులు దీనిని మరో కోణంలో చూస్తున్నారు. రాజకీయ వ్యూహరచన కోసం ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా వినిపిస్తోంది. 2026 ప్రారంభంలో ఈ ముగ్గురూ కలిసి ఒక రహస్య ప్రాంతంలో భవిష్యత్ రాజకీయ రోడ్ మ్యాప్ (కూటమి సమన్వయం) సిద్ధం చేసుకుంటున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఓవాల్ గా రాష్ట్రంలో ‘బిగ్ త్రీ’ లేకపోవడంతో పరిపాలన యంత్రాంగం కొంత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ పర్యటనలపై అధికారిక ప్రకటన విడుదల చేస్తే తప్ప ఈ ఊహాగానాలకు తెరపడేలా లేదు. అయితే, వీరు తిరిగి రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత భారీ మార్పులు లేదా కొత్త పథకాల ప్రకటనలు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

